Tamil Nadu Chief Minister Vijay Cabinet Expansion:తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ మొదట 9 మందితో మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు తన టీంను విస్తరించారు. కొత్తగా 23 మందికి చోటు కల్పించారు. కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్ టీంలో చేరిన కొత్త మంత్రుల జాబితా ఇదే.

శ్రీనాథ్ - తూత్తుకుడి నియోజకవర్గం (విజయ్ స్నేహితుడు, సినిమా నటుడు)

కమలి. ఎస్ - అవినాశి నియోజకవర్గం

సి.విజయలక్ష్మి – కుమారపాలెం నియోజకవర్గం

ఆర్.వి. రంజిత్‌కుమార్ - కాంచీపురం నియోజకవర్గం

వినోద్ - కుంభకోణం నియోజకవర్గం

రాజీవ్ - తిరువాడనై నియోజకవర్గం

పి. రాజ్‌కుమార్ – కడలూరు నియోజకవర్గం

వి.గాంధీరాజ్ – అరక్కోణం నియోజకవర్గం

మదన్ రాజా. బి – ఒట్టపిడారం నియోజకవర్గం

జగదేశ్వరి. కె - రాజపాళయం నియోజకవర్గం

రాజేష్ కుమార్. ఎస్ – కిల్లియూర్ నియోజకవర్గం

ఎం. విజయ్ బాలాజీ – ఈరోడ్ తూర్పు నియోజకవర్గం

లోకేష్ తమిళసెల్వన్. డి – రాసిపురం నియోజకవర్గం

విజయ్ తమిజన్ పార్థిబన్. ఎ – సేలం దక్షిణ నియోజకవర్గం

రమేష్ – శ్రీరంగం నియోజకవర్గం

పి. విశ్వనాథన్ - మేలూరు నియోజకవర్గం

కుమార్. ఆర్ – వేలచ్చేరి నియోజకవర్గం

దక్షిణ రాష్ట్రం. కె – శ్రీపెరుంబుదూర్ నియోజకవర్గం

వి. సంపత్ కుమార్ – కోయంబత్తూరు ఉత్తర నియోజకవర్గం

మహమ్మద్ ఫర్వాజ్. జె – అరంతంగి నియోజకవర్గం

డి. శరత్‌కుమార్ – తాంబరం నియోజకవర్గం

ఎన్. మేరీ విల్సన్ – డా. రాధాకృష్ణన్ నగర్ నియోజకవర్గం

విఘ్నేష్. కె – కినతుకడవు నియోజకవర్గం

తాజాగా ప్రమాణం చేసిన మంత్రుల్లో మిత్రపక్షాలైన కాంగ్రెస్ పార్టీకి రెండు పోర్ట్‌పోలియో ఇచ్చారు. సుమారు 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వనాథన్, రాజేశ్ మంత్రులుగా తమిళనాడులో ప్రమాణ స్వీకారం చేశారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు తెచ్చుకున్న విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. చివరకు కాంగ్రెస్, విదుతలై శిరుతైగళ్‌, వామపక్షాలు, ముస్లిం లీగ్ సహకారంతో సీఎంగా విజయ్ మే 10న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 9 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. తర్వాత మే 13న విజయ్ తన మెజారిటీని నిరూపించుకున్నాడు. దీంతో మొదట ప్రమాణం చేసిన 9 మందికి శాఖలు కేటాయించారు. ఇప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న పోర్ట్‌పోలియా వివరాలు ఇవే.

కె.ఎ. సెంగోట్టయ్యన్‌కు ఆర్థిక, ప్రణాళిక, మానవ వనరుల నిర్వహణ శాఖను కేటాయించారు. అధవ్ అర్జునకు ప్రజా పనుల శాఖ (భవనాలు, రహదారులు, చిన్న ఓడరేవులు), క్రీడాభివృద్ధి శాఖలను కేటాయించారు. ఎన్. ఆనంద్‌కు గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖను కేటాయించారు. డాక్టర్ కె.జి. అరుణ్‌రాజ్‌కు ఆరోగ్య, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖ లభించింది. ఆర్. నిర్మల్ కుమార్‌కు ఇంధన, న్యాయ శాఖల పోర్ట్‌ఫోలియోలను కేటాయించారు.
ఆహార వినియోగదారుల పరిరక్షణ విభాగానికి చెందిన పి. వెంకటరమణన్‌కు లభించింది. ఎస్. కీర్తన పరిశ్రమల శాఖ అప్పగించారు. రాజమోహన్‌ను పాఠశాల విద్యా, తమిళ అభివృద్ధి, సమాచార, ప్రచార విభాగానికి మంత్రిగా నియమించారు. డాక్టర్ డి.కె. ప్రభుకు సహజ వనరులు, ఖనిజాలు, గనుల శాఖను కేటాయించారు.

మిగతా శాఖలను తన వద్దే విజయ్ ఉంచుకున్నారు. ఇప్పుడు టీంను విస్తరించడంతో ఎవరికి ఏ శాఖ ఇవ్వబోతున్నారు అనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా హోంశాఖ ఎవరి చేతిలో ఉంటుందనేది కూడా చర్చకు దారి తీస్తోంది.