Tamil Nadu Assembly Elections 2026: కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు

1 month ago 5
ARTICLE AD

VK Sasikala reveals political party name :  తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, ఏఐఏడీఎంకే మాజీ నాయకురాలు ,  దివంగత సీఎం జయలలిత నెచ్చెలి వి.కె. శశికళ తన కొత్త రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఈ పార్టీకి  ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం AIPTMMK  అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా పార్టీ గుర్తుగా కొబ్బరి తోట  ను ఆమె ఆవిష్కరించారు. ఎంజీఆర్, జయలలిత ఆశయాల బాటలో పేదలు, సామాన్యుల కోసం ఈ పార్టీ పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు.

పార్టీ పేరును ప్రకటిస్తూ శశికళ భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ ఆశయాలను స్మరించుకుంటూ, డీఎంకేకు వ్యతిరేకంగా,  పేదల అభ్యున్నతి కోసం ఆయన ఈ ఉద్యమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.  ఒక్క చెట్టు తోట కాదని, కార్యకర్తలు,  ప్రజలందరూ కలిసి ఒకే కుటుంబంలా ఉంటేనే అది తోట అవుతుంది  అని తన పార్టీ గుర్తు అయిన కొబ్బరి తోట విశిష్టతను వివరించారు. ఈ పార్టీ జెండాపై నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో పాటు అన్నాదురై, ఎంజీఆర్ ,  జయలలిత చిత్రాలను పొందుపరిచారు.

గత తొమ్మిదేళ్లుగా తాను మౌనంగా ఉన్నానని, ఇకపై కూడా మౌనంగా ఉంటే అది తమిళనాడు ప్రజలకు , కార్యకర్తలకు చేసే ద్రోహమవుతుందని శశికళ వ్యాఖ్యానించారు. తమిళనాడులో సరికొత్త ద్రావిడ శకాన్ని ప్రారంభిస్తామని, శత్రువులను ,  ద్రోహులను వేళ్లతో సహా పెకిలించి వేస్తామని ఆమె పరోక్షంగా ఎడప్పాడి పళనిస్వామి  వర్గాన్ని హెచ్చరించారు. జయలలిత 78వ జయంతి సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆమె, ఇప్పుడు పార్టీ పేరును ప్రకటించి రాజకీయాల్లో తన తదుపరి కార్యాచరణను స్పష్టం చేశారు.

#WATCH | Chennai, Tamil Nadu: VK Sasikala announces the name and launches the party symbol of her new party.

The party will be called 'All India Puratchi Thalaivar Makkal Munetra Kazhagam, with 'coconut tree farm' as its symbol. pic.twitter.com/4hFeOeEQK2
— ANI (@ANI) March 13, 2026

రాబోయే ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించుతామని, తమిళనాడు, పుదుచ్చేరి ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని శశికళ పేర్కొన్నారు. అవినీతి ఆరోపణల కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత, పార్టీ నుండి బహిష్కరణకు గురైన ఆమె.. ఇప్పుడు స్వంత పార్టీతో రంగంలోకి దిగడం తమిళనాడు రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏఐఏడీఎంకే ఓటు బ్యాంకుపై శశికళ కొత్త పార్టీ ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే శశికళకు చట్టపరంగా పోటీ చేసే అర్హత లేదు. మరో రెండేళ్ల తర్వాత మాత్రమే ఆమె ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది.

Read Entire Article