Tamannaah The Vvaan Gets Negative Reviews: ముంబై ముద్దుగుమ్మ తమన్నా భాటియాకు స్టార్ హీరోయిన్ హోదా ఇచ్చింది టాలీవుడ్. స్టార్ హీరోలతో నటించే అవకాశాలు ఇచ్చింది. మిల్కీ బ్యూటీ అని ఆడియన్స్ నుంచి ఆమెకు ట్యాగ్ లైన్ వచ్చిందంటే రీజన్ టాలీవుడ్డే. అయితే ఇటీవల హిందీ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలపై కామెంట్స్ చేశారు తమన్నా. హిందీలో కియారా అద్వానీ భర్త సిద్ధార్థ్ మల్హోత్రా సరసన సినిమా చేసే అవకాశం రావడం, ప్రస్తుతం తెలుగులో ఛాన్సులు రాకపోవడంతో ఆ కామెంట్స్ చేసి ఉండొచ్చని టాలీవుడ్ ఆడియన్స్ అనుకున్నారు. కట్ చేస్తే... సిద్ధార్థ్ మల్హోత్రా 'ది వాన్'తో తమన్నా ఖాతాలో మరొక డిజాస్టర్ చేరింది.

తమన్నా 'ది వాన్'కు డిజాస్టర్ రివ్యూలు!
హిందీలో తమన్నా భాటియాకు అసలు కలిసి రావడం లేదు. శ్రద్ధా కపూర్ 'స్త్రీ 2', అజయ్ దేవగణ్ 'రైడ్ 2' సినిమాల్లో ఆమె స్పెషల్ సాంగ్స్ చేశారు. ఆ రెండూ భారీ విజయాలు సాధించాయి. కానీ, కథానాయికగా చేసిన సినిమాలు మాత్రం ఆశించిన రిజల్ట్స్ ఇవ్వడం లేదు. డిజాస్టర్స్ అవుతున్నాయి.

Also Read: Anumana Pakshi Review - 'అనుమాన పక్షి' రివ్యూ: ప్రతిదీ అనుమానించే కుర్రాడు... DJ Tillu దర్శకుడి కొత్త సినిమా ఎలా ఉందంటే?

తమన్నా, సిద్ధార్థ్ మల్హోత్రా భార్యాభర్తలుగా నటించిన సినిమా 'ది వాన్'. ఈ మూవీ కథ విషయానికి వస్తే... నాస్తికుని పాత్రలో సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు. ఆయన భార్య పాత్ర తమన్నాది. అడివిలో వాళ్ళకు ఓ స్థలం ఉంటుంది. ఆ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ ఏర్పడుతుంది. ఇష్యూ నోటీసుల వరకు వెళుతుంది. దాంతో ముంబై నుంచి సొంతూరు వెళతాడు హీరో. అడివిలోకి రాత్రి వేళ వెళితే వనదేవత ఆగ్రహిస్తుందని అక్కడి గ్రామస్థుల నమ్మకం. భక్తి లేని హీరో ఏం చేశాడు? అనేది కథ. ఈ కథలో హీరో భార్యగా తమన్నా పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. సాంగ్స్ కోసం ఓ హీరోయిన్ ఉండాలి కనుక ఉన్నట్టుందని క్రిటిక్స్ కొందరు పెదవి విరుస్తున్నారు. సినిమా ఫ్లాప్ అని తేల్చేశారు.

Also Read: Nani The Paradise Review - 'ది ప్యారడైజ్' రివ్యూ: నాని మాస్ మసాలా బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది? సినిమా హిట్టా? ఫట్టా?

'ది వాన్'కు ముందు హిందీలో 'లస్ట్ స్టోరీస్' సీజన్ 2 చేశారు తమన్నా. విజయ్ వర్మ కాంబినేషన్, ఆ రొమాంటిక్ సీన్స్ వైరల్ అయ్యాయి తప్ప తమన్నా నటనకు పేరు రాలేదు. ఇప్పుడు 'ది వాన్'లో తమన్నా పాట బావుందని చెబుతున్నారు తప్ప ఆమె నటన గురించి పెద్దగా ఎవరూ మాట్లాడలేదు. 'లస్ట్ స్టోరీస్'కి ముందు చేసిన వెబ్ సిరీస్ 'ప్లాన్ ఎ ప్లాన్ బి', 'బబ్లీ బౌన్సర్' సినిమాలూ ఫ్లాపే. హిందీలో హీరోయిన్‌గా సక్సెస్ కోసం తమన్నా ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు వస్తున్నాయ్. మిల్కీ బ్యూటీకి స్పెషల్ సాంగ్స్‌తో కాకుండా హీరోయిన్‌గా హిందీలో హిట్ ఎప్పుడు వస్తుందో?

Also Read: Kayadu Lohar Role In Paradise - అప్పుడు 'పెద్ది'లో జాన్వీ... ఇప్పుడు 'ప్యారడైజ్'లో కయాదు... శ్రీకాంత్ ఓదెల సారీ చెబుతాడా?