Jyothika's Legal Drama System Trailer Review : కోలీవుడ్ స్టార్ సూర్య భార్య జ్యోతిక, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన లీగల్ డ్రామా సిస్టమ్. ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. న్యాయ వ్యవస్థ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ట్రెండ్ అవుతోంది.

తండ్రి వర్సెస్ కూతురు

పేరొందిన ఫేమస్ లాయర్. ఆయన కూతురు కూడా లాయరే. న్యాయం కోసం పోరాడే కుమార్తె తండ్రికే కోర్టులో ఎదురెళ్తుంది. ఆ కుమార్తెకు సపోర్ట్ చేసే ఓ స్టెనోగ్రాఫర్. అసలు కేసేంటి? ఆ కేసులో న్యాయం కోసం తన తండ్రికే ఎందుకు సదరు లాయర్ ఎదురెళ్లాల్సి వచ్చింది? చివరకు న్యాయం గెలిచిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

'ధనవంతుల అరుపుల మధ్య పేదవాడి గొంతు మూగబోతుంది', 'ధనవంతులైనా, పేదవాలైనా న్యాయం మీద అందరికీ హక్కుంటుంది', 'న్యాయం అనేది గాడ్ లాంటిది. అతి కష్టమ్మీద దొరికేది' అనే డైలాగ్స్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

Also Read : రిచ్చెస్ట్ చిన్నారి మిస్సింగ్ మిస్టరీ - ట్రెండింగ్‌లో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్... ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్