SwaRail Superapp : రైల్వే టికెట్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు మరింత సులభం.. స్వరైల్ సూపర్​ యాప్​ ఫీచర్లు, ఉపయోగాలివే

10 months ago 8
ARTICLE AD

SwaRail Superapp Features : భారతదేశంలో దూరప్రయాణాలకు లేదా త్వరగా గమ్యాన్ని చేరుకునేందుకు ఎక్కువమంది ఉపయోగించుకునేది రైలు సేవలనే. అయితే రైల్వే టికెట్స్ బుక్ చేసుకోవడమే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కొందరు ఈజీగానే టికెట్స్ బుక్ చేసుకున్నా.. మరికొందరు కాస్త ఇబ్బంది పడతూ ఉంటారు. అందుకే ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్, ఇతర సేవల కోసం స్వరైల్ సూపర్ యాప్​ను ప్రారంభించింది.

ఇండియన్ రైల్వేలకు సంబంధించిన పబ్లిక్ ఫేసింగ్ యాప్​లన్నింటినీ ఒకే ప్లాట్​ఫారమ్​లోకీ తీసుకొచ్చింది. ఇప్పుడు అన్ని రైల్వే అవసరాలకు ఇది ఒన్​ స్టాప్ సొల్యూషన్​గా ఈ యాప్ ఉపయోగపడనుంది. ఇకపై రైల్వే టికెట్స్ బుక్ చేసుకోవడం నుంచి దీనితో ఎన్నో అవసరాలను, సమస్యలను ప్రయాణికులు క్లియర్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇంతకీ ఈ యాప్​ వల్ల కలిగే లాభాలు ఏంటి? ఫీచర్లు ఏంటి? ఎలా వర్క్ చేస్తుంది వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.

స్వరైల్ సూపర్ యాప్​ బెనిఫిట్స్ ఇవే

రిజర్వ్ చేసిన టికెట్ బుకింగ్, రైళ్లలో ఫుడ్ ఆర్డర్ చేయడం, PNR స్టేటస్ తెలుసుకోవడం వంటి పబ్లిక్ ఫేసింగ్ సేవలను అందించేందుకు ఇది One Stop Destination అంటూ యాప్​ను ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్​లో Android, iOS ప్లాట్​ఫారమ్​లు రెండిటీలో అందుబాటులో ఉంది. స్వరైల్ సూపర్ యాప్​ ఫోన్​లో ఉంటే.. రైల్వే సేవలను వినియోగించేందుకు ఇతర యాప్స్ ఉండాల్సిన అవసరం లేదు.

స్వరైల్ సూపర్ యాప్ ఫీచర్లు

స్వరైల్ సూపర్ యాప్​ను సెంటర్​ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) డెవలెప్ చేసింది. భారతీయ రైల్వే పబ్లిక్ ఫేసింగ్ యాప్​లన్నింటినీ ఒకే ప్లాట్​ఫారమ్​లో ఇన్​క్లూడ్ చేస్తుంది. ఈ యాప్​తో భారతదేశంలోని వినియోగదారులు టికెట్లు రిజర్వ్ చేసుకోవడానికి, ప్లాట్​ఫారమ్ టికెట్​లను బుక్ చేసుకోవచ్చు. పార్సిల్, గూడ్స్ డెలివరీలను ట్రాక్ చేయవచ్చు. రైలు, PNR స్టేటస్​ని ట్రాక్ చేయవచ్చు. రైళ్లలో ట్రావెల్ చేస్తూ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫిర్యాదులు, ఇతర క్వైరీల కోసం.. రైల్ మదాద్​ని సంప్రదించవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

Also Read : వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం

సింగల్ సైన్ ఇన్ ఫంక్షనాలిటీని ఈ యాప్ అందిస్తుంది. వినియోగదారులు ఒకే క్రెడిన్షియల్​తో అన్ని సేవలను యాక్సెస్ చేయవచ్చు. IRCTC RailConnect, UTS వంటి ఇతర ఇండియన్ రైల్వే యాప్​లను కూడా వీటిలో ఉపయోగించుకోవచ్చు. ఇంకా యాప్​ను ఆన్​బోర్డ్ చేయడానికి, తమ ప్రస్తుతం RailConnect లేదా UTS యాప్ కూడా ఉపయోగించవచ్చు. m-PIN, బయోమెట్రిక్ సెక్యూరిటీని ఇది అందిస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ దీనిని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత యాప్​ని పబ్లిక్​గా విడుదల చేయనున్నారు.

Also Read : బడ్జెట్ 2025-26 స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. రైల్వే బడ్జెట్​ని కేంద్ర బడ్జెట్​లో ఎప్పుడు కలిపారో, బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి మహిళ ఎవరో తెలుసా?

Read Entire Article