ARTICLE AD
లేడీ సూపర్ స్టార్ నయనతార కు ఓ లెక్క ఉంటుంది. ఆమె అనుకున్నది జరిగితేనే ప్రాజెక్ట్ ఓకే చేస్తుంది. నయనతార తో బేరాలాడడం అనేది అస్సలు జరగదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఆమె డిమాండ్ నడుస్తూనే ఉంది. ప్రమోషన్స్ కి రాకపోయినా, నయనతార ను పక్కన తిట్టుకున్నా తమ సినిమాల్లో ఆమెనే హీరోయిన్ గా పెట్టుకుంటారు. కానీ నయనతార డిమాండ్స్ తీర్చే నిర్మాతలే ఆమెను తట్టుకుంటారు.
ఇప్పుడు SVC63 కోసం మన టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నయనతార కు కళ్ళు చెదిరే పారితోషికం ఇస్తున్నారట. నయనతార డిమాండ్ ఒప్పుకుని ఆయన బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో చేస్తున్న మూవీ కోసం నయనతార ను తీసుకొచ్చారు. అది కూడా భారీ రెమ్యునరేషన్ కి. వంశి పైడిపల్లి-దిల్ రాజు-సల్మాన్ మూవీ కోసం నయన్ కు ఏకంగా రూ.18 కోట్ల పారితోషికం సమర్పిస్తున్నారట.
అంతకుముందు నయనతార బాలీవుడ్ లో చేసిన డెబ్యూ మూవీ జవాన్ కోసం రూ.10 కోట్లు అందుకుని.. ఇప్పుడు SVC63 కోసం జవాన్ కి డబుల్ పారితోషికం అందుకుంటుంది. మరి ఈలెక్కన నయనతార రేంజ్ ఏమిటో అర్ధమవుతుందిగా..

2 months ago
9