కోలీవుడ్ స్టార్ సూర్య శివకుమార్ (Suriya Sivakumar)కు తెలుగులోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సూర్యను తెలుగు హీరోగా ట్రీట్ చేసే ప్రేక్షకుల సంఖ్య తక్కువేం కాదు. వాళ్ళ కోసం సూర్య టాప్ 10 సినిమాలు ఏవి? అవి ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి? అనేది చూడండి.

తెలుగులో సూర్యకు మొదటి హిట్
Suriya Ghajini OTT Platform: సూర్యకు తెలుగులో విజయం అందించిన మొదటి సినిమా ఏది? అంటే... 'గజినీ' అని చెప్పాలి. నిజానికి ఆ సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయాలని ట్రై చేశారు అల్లు అరవింద్ & ఠాగూర్ మధు. కానీ, డబ్బింగ్ మంచిదని పవన్ సలహా ఇవ్వడంతో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఆ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

'గజినీ' కథ విషయానికి వస్తే... సంపన్నుడైన సంజయ్ రామస్వామి ఓ సాధారణ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఓ గాయం కారణంగా ఆయనకు మెమరీ లాస్ వస్తుంది. తన ప్రేయసిని చంపిన వాళ్ళను మెమరీ లాస్స్ ఉన్నప్పటికీ ఆయన ఎలా చంపాడు? అనేది సినిమా.

'విక్రమ్'లో రోలెక్స్... ఇంపాక్ట్ తెల్సుగా
Vikram OTT Platform: లోక నాయకుడు కమల్ హాసన్ బాక్సాఫీస్ స్టామినాను ఈ తరం ప్రేక్షకులకు తెలిసేలా చేసిన సినిమా 'విక్రమ్'. ఈ సినిమా జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

'విక్రమ్' కథ విషయానికి వస్తే... 'విక్రమ్'లో రోలెక్స్ అనే శక్తివంతమైన విలన్ రోల్ (అతిథి పాత్ర) చేశారు సూర్య. డ్రగ్ మాఫియాను నడిపించే క్రూరమైన డాన్‌గా ఆ పాత్ర కనిపించేది కాసేపే అయినప్పటికీ... నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

జిఆర్ గోపీనాథ్ బయోపిక్... ఆకాశమే
Aakasam Nee Haddura OTT Platform: ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా 'సూరరై పోట్రు'. తెలుగులో ఈ సినిమాను 'ఆకాశమే నీ హద్దురా' పేరుతో విడుదల చేశారు. థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నా... కరోనా కారణంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేశారు.

సామాన్యులకు తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకు రావాలని తపించిన ఓ సామాన్యుడు... ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ బయోపిక్ ఇది. వ్యవస్థలో అడ్డంకులను ఎదుర్కొని తన కలను ఆయన ఎలా సాకారం చేసుకున్నారనేది చిత్ర కథ.

గిరిజన వ్యక్తి న్యాయం కోసం పోరాటం!
Jai Bhim OTT Platform: 'ఆకాశమే నీ హద్దురా' తర్వాత డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చిన మరో సూర్య సినిమా 'జై భీమ్'. ఇదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read: కమల్‌ వల్ల కాలేదు... రజనీ రాలేదు... 60 ఏళ్ళ ద్రావిడ ప్రభుత్వాలను విజయ్ ఎలా ఓడించాడు? సక్సెస్ ఫార్ములా ఏంటి?

'జై భీమ్' కథ విషయానికి వస్తే... వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన కోర్టు రూమ్ డ్రామా ఇది. అన్యాయంగా ఓ గిరిజన వ్యక్తిపై దొంగతనం నేరం మోపుతారు. నిబద్ధత గల న్యాయవాది చంద్రు (సూర్య) పాత్రలో చేసే న్యాయ పోరాటమే సినిమా.

సూర్య అండ్ ట్రిపుల్ ధమాకా.. 24
24 Movie OTT Platform: సూర్య ట్రిపుల్ రోల్ చేసిన సినిమా '24'. ఇదొక సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ 'ఆహా' ఓటీటీలో వీక్షకులకు అందుబాటులో ఉంది.

Also Read: ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి

'24' కథ విషయానికి వస్తే... ఇదొక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. సమయాన్ని కంట్రోల్ చేసే వాచ్ నేపథ్యంలో సాగుతుంది. ఓ శాస్త్రవేత్త, విలన్ ఆత్రేయ, అలాగే కుమారుడు సెతురామన్... మూడు విభిన్న పాత్రల్లో సూర్య నటించారు.

'యముడు'గా సూర్య పోలీస్ మాస్ యాక్షన్!
Yamudu / Singam OTT Platform: సూర్య ప్రయోగాత్మక సినిమాలు మాత్రమే కాదు... మాస్ కమర్షియల్ సినిమాలు కూడా చేశారు. రూరల్ పోలీస్ ఆఫీసర్ నుంచి దేశ విదేశాల్లో క్రిమినల్స్ ఆటకట్టించే పోలీస్ ఆఫీసర్ వరకు 'సింగమ్' ఫ్రాంచైజీలో మూడు సినిమాలు చేశారు సూర్య.

Also Read: SA Chandrasekhar - ఎవరీ ఎస్ఏ చంద్రశేఖర్? తండ్రితో దళపతి విజయ్‌తో గొడవలు, కోర్టు దావా ఏమిటి?

'యముడు', 'సింగమ్', 'సింగమ్ 3'... ఈ మూడు సినిమాలూ జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, మరికొన్ని ఓటీటీల్లో కూడా అందుబాటులో ఉన్నాయి.

రక్త చరిత్ర... వర్మ దర్శకత్వంలో సూర్య
జీఆర్ గోపీనాథ్ బయోపిక్ 'ఆకాశమే నీ హద్దురా' కంటే ముందు సూర్య నటించిన బయోపిక్ 'రక్త చరిత్ర 2'. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. బయోపిక్ కంటే వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ సినిమాలో మద్దెలచెరువు సూరి పాత్రలో సూర్య నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో 'రెట్రో', జీ5 ఓటీటీలో 'సికిందర్', జియో హాట్‌స్టార్ ఓటీటీలో 'ఘటికుడు' సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' స్ట్రీమ్ అవుతోంది. యూట్యూబ్‌లో 'సెవెంత్ సెన్స్', 'వీడోక్కడే' సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అయితే... 'సింగమ్' తర్వాత థియేటర్లలో సూర్యకు సరైన సక్సెస్ లేదు. మరి, 'వీరభద్రుడు' (తమిళంలో 'కరుప్పు')తో విశ్వరూపం చూపిస్తారా? లేదా? అనేది చూడాలి.