సునీల్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు పూర్తి స్థాయి విలన్‌గా గానీ, ఇటు పూర్తి స్థాయి కమెడియన్‌గా గానీ చేయడం లేదు. పైగా హీరోగా సునీల్‌కి అవకాశం వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. ఇలాంటి తరుణంలో సునీల్ కోసం పాపులర్ సినిమాటోగ్రాఫర్, పవన్ కళ్యాణ్ 'ఓజీ'కి వర్క్ చేసిన రవి కె చంద్రన్ ఓ స్టోరీని సిద్దం చేస్తున్నారట. ఆయన కెమెరామెన్‌గానే కాకుండా దర్శకుడిగానూ కేరళ, తమిళనాట పాపులర్ అన్న సంగతి తెలిసిందే. అలాంటి రవి కె చంద్రన్ ఇప్పుడు మన సునీల్ కోసం ఓ స్టోరీని రెడీ చేస్తున్నారట.

అయితే నిర్మాత కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారట. సరైన ప్రొడక్షన్ కంపెనీ, నిర్మాత దొరికితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందట. అందుకే రవి కె చంద్రన్ ఓ నిర్మాతని పట్టుకునే పనిలో ఉన్నాడట. మరో వైపు సునీల్ తన ప్రాజెక్టుల్ని చేసుకుంటూ వెళ్తున్నాడు. పుష్ప తరువాత సునీల్‌కి అన్ని భాషల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. హిందీ, మలయాళీ, కన్నడ, తమిళం ఇలా అన్నింట్లోనూ సునీల్‌కు అవకాశాలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు రవి కె చంద్రన్ కోసం మళ్లీ హీరోగా మారేట్టు కనిపిస్తున్నాడు.

Also Read: Jetlee Twitter Review - 'జెట్లీ' ట్విట్టర్ రివ్యూ: సత్య సినిమాకు మిక్స్డ్ టాక్... కామెడీ కిక్ ఇవ్వలేదా?

సునీల్ కెరీర్ గ్రాఫ్ హీరోగా ఇప్పుడు పూర్తి డౌన్‌లో ఉందన్న సంగతి తెలిసిందే. మర్యాద రామన్న తరువాత హీరోగా సునీల్ చేసిన ఏ ప్రాజెక్ట్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించలేదు. మధ్యలో రకరకాల ప్రయత్నాలు చేసి సునీల్ చేతులు కాల్చుకున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీ అంటూ తన శరీరాకృతిని కూడా మార్చుకున్నాడు. కానీ అది సునీల్‌కి సెట్ అవ్వలేదు. ఆ తరువాత మళ్లీ బాడీ మెయింటైన్స్ మీద ఫోకస్ పెట్టినట్టు కనిపించడం లేదు.

Also Read: Kara Review In Telugu - ధనుష్ 'కర' రివ్యూ: బ్యాంక్ రాబరీలో పోలీసులకు సవాల్ విసిరిన పల్లెటూరి దొంగ… సినిమా ఎలా ఉందంటే?

పుష్ప తరువాత సునీల్‌కి డిఫరెంట్ పాత్రలు వచ్చాయి. తమిళంలో సునీల్ విలన్‌గా చేసిన సినిమాలు బాగానే హిట్ అయ్యాయి. తమిళ చిత్రంలో సునీల్ కనిపిస్తే హిట్ అన్నట్టుగా మారింది. విశాల్ మార్క్ ఆంటోని, రజినీ జైలర్ ఇలా అక్కడ మంచి విజయాలే సునీల్ ఖాతాలో పడ్డాయి. మరి ఈ రవి కె చంద్రన్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

Also Read: Alelle Alelle Song Lyrics - 'అలెల్లె అలెల్లె' లిరిక్స్... ట్రెండింగ్‌లో మహేష్ బాబు అన్న కొడుకు సినిమా 'శ్రీనివాస మంగాపురం'లో సాంగ్ - జీవీ సంగీతంలో శ్రీమణి ఏం రాశారంటే?