Best Fruit Juices to Beat Summer Heat : ఎండ వేడి రోజు రోజుకి పెరిగిపోతుంది. దీనివల్ల శరీరం త్వరగా అలసిపోవడం, డీహైడ్రేషన్కి గురవ్వడం జరుగుతుంది. అందుకే ఈ సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలాంటి సమయంలో చాలామంది డ్రింక్స్ తాగాలని చూస్తారు. కానీ వాటి కంటే ఫ్రూట్ జ్యూసులు మంచివి. ఎందుకంటే ఇవి కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాలు, ఎనర్జీని కూడా అందిస్తాయి. అయితే సమ్మర్లో ఎలాంటి జ్యూస్లు తాగితే శరీరానికి మంచిదో చూసేద్దాం.

పుచ్చకాయ జ్యూస్

పుచ్చకాయలో సుమారు 92% నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇందులో ఉన్న లైకోపీన్ చర్మాన్ని సూర్యకిరణాల వల్ల కలిగే నష్టాల నుంచి కాపాడుతుంది. వేడి వాతావరణంలో లేదా ఎండలో తిరిగినప్పుడు పుచ్చకాయ జ్యూస్ తాగితే వెంటనే ఫ్రెష్‌గా ఫీల్ అవుతారు.

పైనాపిల్ జ్యూస్

పైనాపిల్ జ్యూస్ శరీరానికి తక్షణమే తాజాదనాన్ని అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ C, పొటాషియం శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అలాగే సమ్మర్లో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేసి.. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది.

లిచీ జ్యూస్

వేసవిలో లిచీ జ్యూస్ మంచి కూలింగ్ డ్రింక్‌గా చెప్తారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇది అలసిపోయిన బాడీకి తక్షణమే శక్తిని అందించి.. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.

చెరకు రసం

చెరకు రసం సమ్మర్లో కొందరు ఎక్కువగా తాగుతారు. ఇది సహజమైన ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది. ఇది డీహైడ్రేషన్‌ను తగ్గించి.. శరీరానికి వెంటనే ఎనర్జీ ఇస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

నిమ్మరసం

తక్కువ ఖర్చులో ఆరోగ్యానికి మేలు చేసే పానీయాల్లో నిమ్మరసం ముందు ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచి.. రోగనిరోధక శక్తిని బలపరిచడంతో పాటు.. శరీరాన్ని డిటాక్స్ చేయడంలో కూడా సహాయపడుతుంది.

ఆమ్ పన్నా

మామిడితో మ్యాంగో జ్యూస్ కాకుండా.. ఆమ్ పన్నా కూడా తయారు చేసుకుంటారు. ఇది శరీరాన్ని చల్లబరచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే హీట్ స్ట్రోక్ నుంచి కాపాడుతుంది.

కొబ్బరి నీరు

కొబ్బరి నీరు సహజమైన ఎలక్ట్రోలైట్ డ్రింక్. ఇది శరీరంలో నీటి లోపాన్ని త్వరగా భర్తీ చేస్తుంది. వేసవిలో రోజూ ఒక గ్లాస్ తాగితే చాలా మంచిది.

మజ్జిగ

మజ్జిగ శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా.. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. వేసవిలో తాగేందుకు అనువైన డ్రింక్స్లో ఇది కూడా ఒకటి. దీనిలోని ప్రోబయోటిక్స్ గట్ హెల్త్కి మేలు చేస్తాయి.

జ్యూస్లు తాగాలనుకుంటే..

వేసవిలో జ్యూస్లు మంచి ఆప్షనే. కానీ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జ్యూస్లో షుగర్ లేకుండా లేదా తక్కువ షుగర్ వేసుకుని తాగండి. ప్యాక్డ్ జ్యూస్ల కంటే.. తాజా పండ్లతో తయారు చేసినవి బెస్ట్. అలాగే రోజుకు 1 లేదా 2 గ్లాసులు తాగితే సరిపోతుంది. ఇలా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ తగ్గి.. ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.