‘పుష్ప 2’ రిలీజై బంపర్ హిట్ సాధించింది. ఈ సినిమా 500 కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి పై సుకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

‘పుష్ప 1’ విజయం వెనుక రాజమౌళి
‘పుష్ప 1’ పాన్ ఇండియా రిలీజ్ వెనుక మరో టాప్ దర్శకుడు ఉన్నారు. ఆయన ఎవరో కాదు స్టార్ దర్శకుడు రాజమౌళి. ఈ విషయాన్ని దర్శకుడు సుకుమార్ స్వయంగా వెల్లడించారు. పుష్ప ఫస్ట్ పార్ట్ ను హిందీలో విడుదల చేయాలనే ప్లాన్ సుకుమార్ కు లేనే లేదు. అసలు ఈ పుష్ప లోని రెండు పాటలు రిలీజ్ చేశాక కూడా దర్శకుడు సుకుమార్ కి ఆ ప్లాన్ లేదు. రాజమౌళి ఈ సినిమా కంటెంట్ చూసి ఇంప్రెస్ అయి, ఈ మూవీని కచ్చితంగా హిందీలో కూడా విడుదల చేయాలని పట్టుబట్టారట. తనే స్వయంగా దర్శకుడు సుకుమార్ తో మాట్లాడారు. అంతే కాకుండా హీరో బన్నీ లతో పాటు నిర్మాతలతో కూడా మాట్లాడి ‘పుష్ప 1’ పాన్ ఇండియా రిలీజ్ కోసం ఒప్పించారు. ఈ ప్లాన్ వర్క వుట్ అయింది.

ద ట్రెండ్ సెట్టర్... రాజమౌళి
పుష్ప ఫస్ట్ పార్ట్ తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ బెల్ట్ లోనూ సూపర్ హిట్ అయింది. అలా రాజమౌళి తీసుకున్న ఇనీషియన్ ‘పుష్ప’ ఫ్రాంచైజ్ కి పాన్ ఇండియా స్టేటస్ తెచ్చిపెట్టింది. ‘బాహుబలి’కి ముందు, బాహుబలికి తర్వాత అన్నట్లు ప్రభాస్ కెరీర్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతోంది. ‘బాహుబలి’ ఫ్రాంచైస్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు కాస్త ఝలక్ ఇచ్చాయి. ఈ సినిమాలు నార్త్ లో మాత్రం కలెక్షన్లు అదరగొట్టాయి. దీనికి కారణం కేవలం ‘బాహుబలి’ క్రేజ్ నే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లను మలుపు తిప్పి, తన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్లను చేసందీ రాజమౌళీనే. అయితే, నేరుగా బన్నీ తో సినిమా చేయకపోయినా, హీరో అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేశారు రాజమౌళి.

Also Read: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ జాతర... అఫీషియల్‌గా రెండు రోజుల్లో 'పుష్ప 2' కలెక్షన్లు ఎంతో తెలుసా?

లెక్కల మాస్టార్ కు పెద్ద ఫ్యాన్
దర్శకుడు సుకుమార్ టేకింగ్ కు రాజమౌళి పెద్ద ఫ్యాన్. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా చాలా ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. మొదటి నుంచి కాస్త వైవిధ్యమైన హీరో క్యారెక్టరైజేషన్స్, విభిన్నమైన స్క్రీన్ ప్లేతో సుకుమార్ తన కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సుకుమార్ గనక తన శైలికి భిన్నంగా కరెక్ట్ మాస్ సినిమా తీస్తే తాను సర్దుకోవాల్సిందే అని రాజమౌళి అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా తీశాక, ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. దాంతో సుకుమార్ తన రూట్ మార్చి రామ్ చరణ్ తో ‘రంగస్థలం’ సినిమా తీశారు. మంచి హిట్ అయింది. రామ్ చరణ్ లోని కొత్త నటుణ్ణి ప్రపంచానికి పరిచయం చేసింది. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి, ‘అలవైకుంఠపురంలో’ లాంటి సాఫ్ట్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్లతో కెరీర్ సాగిస్తున్న బన్నీని ‘పుష్పరాజ్’ లాంటి మాస్ అవతార్ లో చూపించి, ఆయనకు ఓ కల్ట్ రోల్ ఇచ్చారు సుకుమార్.

Also Read: పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్... ఇక మెగా వర్సెస్ అల్లు వివాదానికి ఎండ్ కార్డ్!?