Sudigali Sudheer Deepika Pilli Dating Rumours : ప్రముఖ నటుడు, యాంకర్ సుడిగాలి సుధీర్‌కు సంబంధించిన ఏ వార్త అయినా కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. అది సుధీర్‌కి ఉన్న ఫ్యాన్ బేస్. ఆయనకి దాదాపు అన్నీ పాజిటివ్ కామెంట్లే కనిపిస్తుంటాయి. నెగెటివిటీ లేని బుల్లితెర స్టార్, హీరో సుధీర్ అని చెప్పుకోవచ్చు. ఇక వెండితెరపైనా హీరోగా పలు రకాలుగా ప్రయత్నాలు చేశాడు. గాలోడు అంటూ మొదటి కమర్షియల్ హిట్టుని సుధీర్ కొట్టేశాడు. ఇప్పుడు కూడా పలు చిత్రాల్ని చేతిలో పెట్టుకున్నాడు. ఇక త్వరలోనే ‘గోట్’ అనే చిత్రంతో ఆడియెన్స్‌ని పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.

ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు బుల్లితెరపై షోలు, మరో వైపు ఆహా వంటి ఫ్లాట్ ఫాం మీద స్పెషల్ షోలు చేస్తూ సుధీర్ బిజీగా ఉన్నాడు. అలాంటి సుధీర్ మీద నిన్న అంతా ఓ వార్త వైరల్ అయింది. దీపిక పిల్లి ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ కనిపించింది. అందులో దీపిక, సుధీర్ కలిసి కనిపించారు. పైగా సుధీర్‌కి ట్యాగ్ చేసినట్టుగా ఉంది. అందులో లాక్డ్ ఎమోజీని కూడా పెట్టేసింది. ఈ ఇద్దరూ లాక్ అయ్యారా? సినిమా కోసం లాక్ అయ్యారా? అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Also Read : రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్

దీపిక పోస్ట్ వైరల్

సుధీర్ గురించి దీపిక పోస్ట్ వేసిందని నెట్టింట్లో ఒక్కసారిగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే దీపిక మాత్రం తెలివిగా ఈ వార్తల్ని కొట్టి పారేసింది. తన ఇన్ స్టా హ్యాక్ అయిందని, గడిచిన 24 గంటల్లో తన ఇన్ స్టా నుంచి వచ్చిన పోస్టుల్ని లెక్కలోకి తీసుకోవద్దని, అవన్నీ ఫేక్ అని, అవన్నీ ఏఐ ఎడిట్స్ అని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. దీపిక ఇలా కావాలనే చేస్తుందా? లేదా నిజంగానే హ్యాక్ అయిందా? అన్నది మాత్రం ఆ దేవుడికే తెలియాలి. దీపిక పిల్లి, సుధీర్ కలిసి చేసిన షోలు కూడా బుల్లితెరపై మంచి హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే.

దీపిక పిల్లి సైతం హీరోయిన్‌గా తెరపై రాణించాలని తెగ ప్రయత్నిస్తోంది. అందుకే బుల్లితెరకు కాస్త దూరంగానే ఉంటూ సిల్వర్ స్క్రీన్ ప్రయత్నాలు చేస్తోంది. ఆ మధ్య ప్రదీప్ మాచిరాజుతో ఓ సినిమా చేసింది. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. దీపిక పిల్లి ప్రాజెక్టులు కూడా ఇప్పుడు విడుదలకు రెడీగా ఉన్నట్టు సమాచారం.