ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాదు... ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ సినిమాలలో SSMB29 ఒకటి. అదేనండి... సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించనున్న పాన్ వరల్డ్ సినిమా. ఆ సినిమా కోసం హైదరాబాద్ సిటీలో భారీ సెట్స్ వేయనున్నారని సమాచారం. ఏకంగా ఒక నగరాన్ని క్రియేట్ చేయాలని రెడీ అయ్యారట.

హైదరాబాద్ సిటీలో కాశి సెట్స్!
గ్లోబ్ ట్రాంటింగ్ జానర్ సినిమా తీయబోతున్నట్లు రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఎప్పుడో చెప్పారు. ఇండియాతో పాటు సౌత్ ఆఫ్రికా, యూరోప్ దేశాలలో షూటింగ్ చేయనున్నారు. మన ఇండియా విషయానికి వచ్చేసరికి కథలో కొంత భాగం కాశీ నేపథ్యంలో జరుగుతుందట.

మహేష్ బాబును కాశీ తీసుకువెళ్లి షూటింగ్ చేయడం కష్టం కనుక హైదరాబాద్ సిటీలోనే కాశి క్రియేట్ చేయాలని రాజమౌళి డిసైడ్ అయ్యారని తెలిసింది. 'కల్కి 2989 ఏడి' సినిమా కోసం కాశీని హైదరాబాదులో సృష్టించారు. అయితే... ఇప్పుడున్న కాశీ నగరాన్ని కాకుండా కొన్నేళ్ల తర్వాత కాశీ ఎలా మారబోతుందనేది ఊహించి సెట్ వేశారు. మహేష్ బాబు సినిమా కోసం అలా కాదు... ఇప్పుడు కాశీ నగరం ఎలా ఉందో అటువంటి నగరాన్ని క్రియేట్ చేయబోతున్నారట.

ముఖ్యంగా వారణాసిలోని మణికర్ణిక ఘాట్ సెట్స్ హైదరాబాదులో వేస్తారని తెలిసింది. హిందువులకు కాశీ ఎంత పవిత్రమైన నగరం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాశీలో మహేష్ బాబు సినిమా కథ జరుగుతుందంటే... జక్కన్న హిందూ పురాణాలను సైతం టచ్ చేస్తున్నారని ఆశించవచ్చు.

Also Read: ఉరి తీసిన 2 గంటల తర్వాత కూడా ఊపిరితో... రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

తమ్ముడు పెళ్లి కోసం గ్యాప్ ఇచ్చిన ప్రియాంక చోప్రా!
మహేష్ బాబు రాజమౌళి కలయికలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకు ఏ హీరోయిన్ అందుకోనంత రెమ్యూనరేషన్ ఆవిడ తీసుకోబోతున్నారని తెలిసింది. ఒక్క సినిమాకు గాను ఆవిడకు 30 కోట్ల రూపాయలు ఇస్తున్నారట.

Also Read: థియేటర్లలో వచ్చిన నెలకే ఓటీటీలోకి 'గేమ్ చేంజర్'... ప్రైమ్ వీడియోలో ఈ వారమే రామ్ చరణ్ సినిమా స్ట్రీమింగ్... డేట్ తెల్సా?

SSMB29 సినిమా కోసం హైదరాబాద్ వచ్చిన ప్రియాంక చోప్రా కొన్ని రోజులు వర్క్ షాప్స్ చేయడంతో పాటు షూటింగులోనూ పాల్గొన్నారు. అయితే తన తమ్ముడి పెళ్లి కోసం కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారని తెలిసింది. ఇటీవల శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దగ్గర ప్రియాంక చోప్రా కనిపించారు. మళ్లీ ఎప్పుడు వస్తారనేది చూడాలి. దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం విలన్ రోల్ చేయనున్నారని సమాచారం. తొలుత ఆ పాత్రకు పృథ్వీరాజ్ సుకుమారన్‌ను అనుకున్నా చివరకు జాన్ అబ్రహం ఫిక్స్ అయ్యారట.