SSMB29 నుంచి బ్రేక్ తీసుకున్న ప్రియాంక

10 months ago 8
ARTICLE AD

మహేష్-రాజమౌళి కాంబోలో రీసెంట్ గా మొదలైనపాన్ ఇండియా ప్రోజెక్ట్ లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటిస్తుంది అనేది యూనిట్ కన్ ఫర్మ్ చెయ్యకపోయినా.. ఆమె హైదరాబాద్ రావడం, ఇండైరెక్ట్ గా SSMB 29 పై పోస్ట్ లు పెట్టడం తో ఆ విషయాన్నిఅందరూ ఫిక్స్ అయ్యారు. కొద్దిరోజులుగా హైదరాబాద్ లో ఉండి,రాజమౌళి-మహేష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది ప్రియాంక. 

తాజాగా SSMB 29 షూటింగ్ నుంచి ప్రియాంక చోప్రా చిన్న బ్రేక్ తీసుకుని ముంబై వెళ్లిన ఎయిర్ పోర్ట్ వీడియోస్ వైరల్ అయ్యాయి.అయితే రాజమౌళి సినిమా నుంచి ప్రియాంక బ్రేక్ తీసుకోవడానికి కారణం ఆమె సోదరుడి వివాహం ముంబై లో జరుగుతూ ఉండడంతో ప్రియాంక చోప్రా SSMB 29 షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 

ఆమె రాజమౌళి సినిమాలో నటిస్తుంది అనే ప్రచారం  మొదలయ్యాక ప్రియాంక చోప్రాపై సౌత్ మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆమెని తెగ హైలెట్ చేస్తుంది. ఇక ఈచిత్రంలో నటిస్తున్న ప్రియాంక చోప్రా అత్యధిక పారితోషికం అందుకుంటున్నట్టుగా గుసగుసలు మొదలయ్యాయి. 

Read Entire Article