SSMB29 కోసం బాలీవుడ్ యాక్టర్

9 months ago 8
ARTICLE AD

దర్శకధీరుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్‌తో మూవీ మొదలు పెట్టారు, రెగ్యులర్ షూటింగ్‌కి కూడా వెళ్లిపోయారు. కాని అధికారికంగా ఎలాంటి హడావుడి లేదు, అంతా సైలెంట్‌గా జరిగిపోతుంది. ఇప్పుడీ SSMB29 కోసం బాలీవుడ్ నుంచి ఇతర భాషల నుంచి స్టార్ నటులు భాగమవుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. రాజమౌళి-మహేష్ మూవీలో జాయిన్ అయ్యింది. 

మరోపక్క మలయాళ స్టార్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా రాజమౌళి-మహేష్ మూవీలో నటించనున్నారని వార్తలు చక్కర్లు కొట్టడం పృథ్వీరాజ్ వాటిపై క్లారిటీ ఇవ్వడం జరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నుంచి మరో నటుడు SSMB29లోకి అడుగుపెట్టబోతున్నారట. 

హిందీ నటుడు నానా పటేకర్‌ను.. రాజమౌళి-మహేష్ కాంబో మూవీలో ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారట రాజమౌళి. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా ఈమూవీ ఉండబోతున్నట్లుగా చెబుతున్నారు. హీరోయిన్ కూడా హాలీవుడ్ నుంచి రాబోతుందనేది టాక్. అసలు అధికారిక ప్రకటన రాకముందే ఈ చిత్రంలో ఇన్ని స్పెషల్స్ ఉన్నట్టుగా తెలియడం మహేష్ ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

Read Entire Article