Sreeleela: హీరోలను వెయిట్ చేయిస్తూ... నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న శ్రీ లీల?
10 months ago 8
ARTICLE AD
శ్రీ లీల (Sreeleela)కు హిట్టు ఫ్లాపులతో సంబంధం లేదు. ఆమెతో సినిమాలు చేసేందుకు హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు యువతలో ఆమెకు ఉన్న క్రేజ్ ఒక కారణం అయితే... డాన్స్ అద్భుతంగా చేయగలగడం మరొక కారణం. ప్రేక్షకులలో శ్రీ లీలకు విపరీతమైన క్రేజ్ ఉంది. దాంతో అవకాశాలకు కొదవ లేదు. అయితే... ఇప్పుడు ఆవిడ వల్ల హీరోలు, నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారని టాలీవుడ్ గుసగుస. ఎందుకు? ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...
డేట్స్ అడ్జస్ట్ చేయలేక శ్రీ లీల తికమక!
'పెళ్లి సందD'తో శ్రీ లీల తెలుగు తెరపైకి వచ్చింది. అందులో ఆమె అందానికి కుర్ర కారు ఫిదా అయితే... మాస్ మహారాజా రవితేజకు జంటగా నటించిన 'ధమాకా'తో ఆమెకు స్టార్ స్టేటస్ వచ్చేసింది. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. శ్రీ లీల చేతిలో ఎప్పుడూ అరడజను సినిమాలు తప్పకుండా ఉంటాయి. 'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ చేయడానికి ముందు శ్రీ లీల చేసిన సినిమాలు అన్ని ఫ్లాప్. అయినా సరే చేతిలో ఉన్న సినిమాలు అయ్యేసరికి 'పుష్ప 2' హిట్ కావడంతో మరోసారి ఆవిడకు వరుస అవకాశాలు వచ్చాయి.
శ్రీ లీల కూడా తనకు వచ్చిన అవకాశాలను కాదనకుండా ఓకే చేసిందని టాక్. ఓకే చేయడం వల్ల తప్పులేదు. రెమ్యునరేషన్ పెంచడంలో కూడా తప్పులేదు. ఆవిడ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు రెడీగానే ఉన్నారు. అయితే... కోరిన రెమ్యునరేషన్ ఇచ్చిన నిర్మాతలకు అడిగిన డేట్స్ ఎడ్జస్ట్ చేయలేక శ్రీ లీల తికమక పడుతోందని, అందరినీ ఇబ్బంది పెడుతోందని టాలీవుడ్ టాక్.
రవితేజ సినిమా ఆలస్యానికి అసలు కారణం లీల!?
Also Read: చిరంజీవి కోసం రవితేజ త్యాగం... సమ్మర్ సీజన్ వదిలేసిన 'మాస్ జాతర'
వచ్చిన అవకాశాలు కాదనకుండా ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకోవడంతో ఏ సినిమాకూ డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితిలో శ్రీ లీల ఉందట. ఒకవేళ 'మాస్ జాతర' నుంచి శ్రీ లీలను తీసి మరొక అమ్మాయిని సెలెక్ట్ చేద్దామంటే ఆల్రెడీ షూటింగ్ చేసినవన్నీ మళ్ళీ రీ షూట్ చేయాలి. దానికి ఎక్స్ట్రా బడ్జెట్ అవుతుంది. దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నిర్మాతలు ఉన్నారు. రష్మిక డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని నితిన్ 'రాబిన్ హుడ్' సినిమాకు శ్రీ లీలను సెలెక్ట్ చేస్తే ఆవిడ వల్ల సాంగ్ షూట్స్ లేట్ అయ్యాయని టాక్. అఖిల్ కొత్త సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్. ఆ సినిమాకూ డేట్స్ సరిగా అడ్జెస్ట్ చేయడం లేదట. హీరోయిన్లు ఒకేసారి నాలుగైదు సినిమాలు చేస్తారు. హీరోలు అలా కాదు, ఓ సినిమా పూర్తి అయ్యాక మరో సినిమా చేస్తారు. శ్రీ లీల కోసం హీరోలు వెయిట్ చేయాల్సి వస్తోంది. దాంతో నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు.
తమిళంలో, హిందీలో శ్రీ లీలకు ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి. ఆ సినిమాల కోసం ఆవిడ తెలుగు హీరోలను నిర్మాతలను డేట్స్ ఎడ్జస్ట్ చేయకుండా ఇబ్బంది పడుతుందట. శ్రీ లీల తీరు ఇదే విధంగా కొనసాగితే ఆవిడని సినిమాల నుంచి తీసేయక తప్పని పరిస్థితులు వస్తాయని టాక్.
Read Entire Article