Spirituality: జపమాల అనేది కేవలం ఒకే మతానికి చెందినది కాదు. హిందూ సంప్రదాయంతో పాటూ బౌద్ధం, జైన, క్రైస్తవం, ఇస్లాం వంటి అనేక మతాల్లో పూసల సరాలను ధ్యానం కోసం వినియోగిస్తారు. అయితే చారిత్రక స్పష్టమైన పురావస్తు ఆధారాల ప్రకారం ఈ విధానం ముందుగా బౌద్ధ సంప్రదాయంలో కనిపిస్తుంది. ముఖ్యంగా మహాయాన బౌద్ధంలో మంత్రాన్ని లెక్కించేందుకు జపమాల వినియోగించేవారు. అజంతా, అజంతా, నాసిక్, ఎల్లోరా వంటి గుహల శిల్పాల్లో బోధిసత్వుల చేతిలో మాలలు కనిపిస్తాయి. ముఖ్యంగా అవలోకితేశ్వరుడు ఆరాధనలో మాలను వినియోగంచేవారు.

జపమాలలో 108 పూసలే ఎందుకు?

దీనికి సంబంధించి బౌద్ధతత్త్వంలో లోతైన వివరణ ఉంది. ఇంద్రియాలు ఆరు.. చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ , మనస్సు. ఈ ఆరు ఇంద్రియాలు 3 తృష్ణలతో అనుసంధానమవుతాయి..అవే కామ తృష్ణ, భవ తృష్ణ, విభవ తృష్ణ. ఈ ఆరు ఇంద్రియాలు మూడు తృష్ణలతో కలిపి పద్దెనిమిదిగా మారుతాయి. ఈ 18 స్థితులు లౌకిక, ఆధ్యాత్మిక స్వభావంవల్ల 36గా మారుతాయి. భూత,భవిష్యత్, వర్తమాల అనే మూడుకాలలతో 36 ను 3తో గుణిస్తే 108 అవుతుంది. ఈ 108 మనో మాలిన్యాలను అధిగమించేందుకే ధ్యానసాధన. అందుకే జపమాలలో 108 పూసలు ఉండడం ప్రతీకాత్మక సాధనంగా మారింది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 12 రాశులు × 9 గ్రహాలు = 108...ఇవి కలిపితేనే జాతకం

27 నక్షత్రాలు..ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు..27 × 4 పాదాలు = 108

108 దేవతల పేర్లు, 108 ఉపనిషత్తులు, మనిషి 108 క్లేమాలు..

బౌధ్దంలో మాత్రమే కాదు..

108 బౌద్ధంలోనే కాదు ఇతర సంప్రదాయాల్లోనూ ప్రాముఖ్యత పొందిన సంఖ్య. భారతీయ జ్యోతిషశాస్త్రంలో 12 రాశులు , 9 గ్రహాలు కలిపి 108 అవుతాయి. యోగ సంప్రదాయంలో శరీరంలో ప్రధాన నాడులు 108. ఖగోళ అంచనాల్లో భూమి , సూర్యుడు, చంద్రుడు మధ్య దూరాలకు సంబంధించిన లెక్కల్లో కూడా 108 సంఖ్యకు సమీప సంబంధం ఉంటుంది. జపాన్ బౌద్ధ సంప్రదాయంలో 108 పాపాలను సూచిస్తూ ఆలయ గంటలను 108 సార్లు మోగించే ఆచారం ఉంది. ఈ విధంగా 108 ఒక సాంస్కృతిక , ఆధ్యాత్మిక ప్రతీక సంఖ్యగా నిలిచిపోయింది.

జపమాల మారిందిలా!

జపమాల ఆరంభంలో చెక్క పూసలతో తయారైంది. ఆ తర్వాత కాలంలో రుద్రాక్ష, తులసి, స్ఫటికం, ముత్యాలతో జపమాలలు వచ్చాయి. వివిధ మతాల్లో పూసల సంఖ్య మారినా, జపం కోసం మాలలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇస్లాంలో 99 పూసల తస్బీహ్ ఉంటుంది, క్రైస్తవంలో రోసరీ వాడకం ఉంది.కానీ 108 పూసల జపమాలకు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం ఉంది.

బౌద్ధంలో అసలు ప్రాధాన్యత జపమాలకు కాదు..ధ్యానానికి. మనస్సును పరిశీలించడం, శ్వాసను గమనించడం, బాధ మూలాన్ని అర్థం చేసుకోవడమే ధ్యానం అంటే. జపమాల కేవలం సహాయ సాధనం మాత్రమే. అది ఏకాగ్రతకు సహకరిస్తుంది కానీ విముక్తిమార్గం దానిపై ఆధారపడి ఉండదు

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

<a title=" అసలైన హనుమాన్ జయంతి మే నెలలోనే! తేదీ, పూజా విధానంతో పాటూ ఆంజనేయుడి పుట్టుక గురించి పురాణాల్లో ఏముందో తెలుసుకోండి?" href="https://telugu.abplive.com/spirituality/hanuman-jayanti-2026-date-puja-time-vidhi-significance-in-south-india-know-in-telugu-246046" target="_self"> అసలైన హనుమాన్ జయంతి మే నెలలోనే! తేదీ, పూజా విధానంతో పాటూ ఆంజనేయుడి పుట్టుక గురించి పురాణాల్లో ఏముందో తెలుసుకోండి?