ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో 'స్పిరిట్' (Spirit Movie) ఒకటి. హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన వాయిస్ టీజర్ వైరల్ అయ్యింది. విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి', షాహిద్ కపూర్ 'కబీర్ సింగ్', రణబీర్ కపూర్ 'యానిమల్'... హ్యాట్రిక్ విజయాల తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ రోజు పూజతో చిత్రీకరణ ప్రారంభించారు.

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా!
Prabhas Movie Spirit Muhurat News: నవంబర్ 23, ఆదివారం... ప్రభాస్ 'స్పిరిట్' అధికారికంగా సెట్స్ మీదకు వెళ్ళింది. పూజతో సినిమాను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. హీరోపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఆయన క్లాప్ ఇచ్చారు.

Also Read: 'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? హీరోయిన్లు, ఆర్టిస్టులకు అందులో సగం కూడా ఇవ్వలేదు

ప్రభాస్ లుక్ రివీల్ చేయని 'స్పిరిట్' టీం!
'స్పిరిట్' పూజ జరిగినట్టు, చిత్రీకరణ మొదలు పెట్టినట్టు తెలిపిన టీం... ప్రభాస్ లుక్ మాత్రం రివీల్ చేయలేదు. పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న ఫోటోలు విడుదల చేయలేదు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం స్పెషల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్టు ఉన్నారు.

'స్పిరిట్'... పాన్ - వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్!
'స్పిరిట్' పాన్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ అని చిత్ర బృందం పేర్కొంది. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా, అందులోనూ ప్రభాస్ హీరో కావడంతో 'స్పిరిట్' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
'స్పిరిట్' సినిమాను భద్రకాళి పిక్చర్స్ పతాకం మీద ప్రణయ్ రెడ్డి వంగా, టీ సిరీస్ పతాకం మీద కృష్ణ కుమార్, భూషణ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో భారీ యాక్షన్ సీన్లు ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.

'స్పిరిట్'లో ఎవరెవరు ఉన్నారంటే?
Spirit Movie Cast And Crew: 'స్పిరిట్'లో ప్రభాస్ సరసన తృప్తి డిమ్రి నాయికగా నటిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్'లో ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఆ క్యారెక్టర్, తృప్తి సీన్లు వైరల్ అయ్యాయి. ఇంకా వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన తదితరులు నటిస్తున్నారు. ప్రేక్షకులకు గ్లోబల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేలా సినిమాను తెరకెక్కించనున్నారు.

Also Read: అక్షయ్ కుమార్ vs సైఫ్ అలీ ఖాన్... ఇద్దరిలో ఎవరు శ్రీమంతుడో తెలుసా? ఎవరి దగ్గర ఎక్కువ ఆస్తి ఉందంటే?