Battle with AI videos: నిజమైన యుద్ధం ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో జరుగుతూంటే .. డిజిటల్ యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా ఎక్స్ లో భయంకరంగా సాగుతోంది. కృత్రిమ మేధ , హై-గ్రాఫిక్స్ వీడియో గేమ్స్ సాయంతో నెటిజన్లు సృష్టిస్తున్న దృశ్యాలు అసలు యుద్ధాన్ని మించిపోయేలా ఉన్నాయి. ఈ

ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలతో సోషల్ మీడియా ఒక యుద్ధ క్షేత్రంగా మారింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణకు సంబంధించి నెటిజన్లు షేర్ చేస్తున్న వీడియోలు చూస్తుంటే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వైరల్ అవుతున్న చాలా వీడియోలు వాస్తవమైనవి కావు.

🚨 ADVERTENCIA: Israel no esperaba esto. La tecnología hipersónica de Irán superó las defensas. "No permitas que un amigo te lleve a una guerra de alcance desconocido". 😱😯🇮🇷🇮🇱⚠️ #Israel #Iran #Breaking pic.twitter.com/D2QGwPqDPI

— PolitiCrack, (@AnalistaClara) March 3, 2026

ఆర్మా 3 (Arma 3) వంటి మిలిటరీ సిమ్యులేషన్ వీడియో గేమ్స్‌లోని దృశ్యాలను, ఏఐ సాంకేతికతతో రూపొందించిన హైపర్-రియలిస్టిక్ గ్రాఫిక్స్‌ను అసలు యుద్ధ దృశ్యాలుగా నమ్మించే ప్రయత్నం జరుగుతోంది. ఫలితంగా, క్షేత్రస్థాయిలో జరిగే యుద్ధం కంటే డిజిటల్ తెరపై కనిపిస్తున్న యుద్ధమే అత్యంత భయంకరంగా కనిపిస్తోంది.

My friend in Israel has recorded this 👇🏾 #Israel #Iran #America #Khamenei pic.twitter.com/7MVPg5tF8K

— Sakshi Joshi (@sakshijoshii) March 3, 2026

How stupid can you be to believe this is real?

Iran is circulating Arma 3 video game footage claiming a successful missile strike on the USS Abraham Lincoln.#Iran #Israel pic.twitter.com/IoyJE2SCk0

— Tom Bitcoin (@TomBitcoin) March 3, 2026

ఏఐ ద్వారా సృష్టించిన క్షిపణి దాడులు, పేలుళ్ల వీడియోలు క్షణాల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ ప్రజల్లో భయాందోళనలను పెంచుతున్నాయి. దీనిని నిపుణులు ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ అని పిలుస్తున్నారు. ట్విట్టర్ (ఎక్స్) వంటి వేదికలపై కమ్యూనిటీ నోట్స్ వంటి ఫ్యాక్ట్-చెక్ ఫీచర్లు ఉన్నప్పటికీ, సమాచారం వ్యాపించే వేగం ముందు అవి సరిపోవడం లేదు.

4461
ANALYSIS: Fake

FACT: A video showing a burning aircraft and flames at an airport terminal is being circulated with claims that it depicts Dubai International Airport engulfed in fire following Iranian missile strikes amid ongoing tensions in the Middle East. (1/4) pic.twitter.com/5n7QdKxkdj

— D-Intent Data (@dintentdata) March 3, 2026

వీడియో గేమ్ దృశ్యాలు ఎంతలా తప్పుదోవ పట్టిస్తున్నాయంటే.. విమానాలు కూలిపోవడం, నగరాలపై బాంబుల వర్షం కురవడం వంటివి అత్యంత స్పష్టంగా ఉండటంతో అవి నకిలీవని గుర్తించడం సామాన్యులకు సాధ్యం కావడం లేదు. గతంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలోనూ ఇదే తరహా ధోరణి కనిపించింది, కానీ ఇప్పుడు గల్ఫ్ సంక్షోభంలో ఏఐ వాడకం వల్ల ఇది మరో స్థాయికి చేరుకుంది. కేవలం ఆకర్షణ కోసమే కాకుండా, విదేశీ ద్రవ్యం కోసం యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇలాంటి సంచలన వీడియోలను ప్రమోట్ చేయడం ఈ గందరగోళానికి మరింత ఆజ్యం పోస్తోంది.

Why is an official account of @GovtofPakistan sharing an Arma 3 Simulation video. pic.twitter.com/OdUKvusvWI

— Mohammed Zubair (@zoo_bear) May 9, 2025

ఈ పరిణామం ప్రపంచ దేశాల భద్రతకు కొత్త సవాలుగా మారింది. నిజమైన యుద్ధం కంటే ఇలాంటి డిజిటల్ స్లాప్ వల్ల మార్కెట్లు కుప్పకూలడం, చమురు ధరలు పెరగడం వంటి ఆర్థిక పరిణామాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఒక్కోసారి ఈ నకిలీ సమాచారాన్ని నిజమని నమ్మి తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది.