Skoda Cars May 2026 Discounts Kushaq Slavia Kylaq and Kodiaq: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్కోడా ఆటో ఇండియా మే 2026 నెలకు సంబంధించి సరికొత్త డిస్కౌంట్లు, ఆఫర్లను అధికారికంగా ప్రకటించింది. పాత ఇన్వెంటరీ స్టాక్‌ను వీలైనంత త్వరగా క్లియర్ చేయడంపైనే కంపెనీ ఈ నెల ముఖ్యంగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా కుషాక్, కొడియాక్ మోడళ్ల పాత స్టాక్‌పై భారీ ఆఫర్లు ఇస్తుండగా, కొత్త మై26 (MY26) మోడళ్లపై బెనిఫిట్స్ కాస్త తక్కువగా ఉన్నాయి. కస్టమర్లు ఎంచుకునే మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ నెల క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లు, లాయల్టీ బెనిఫిట్స్ రూపంలో గరిష్టంగా రూ. 3.50 లక్షల వరకు ప్రయోజనాలను అందుకోవచ్చు. డీలర్‌షిప్ లెక్చరర్ల సమాచారం ప్రకారం ఈ ఆఫర్లు సిటీలను బట్టి, డీలర్లను బట్టి కొద్దిగా మారే అవకాశం ఉంటుంది.

Read Also: Mahindra BE6 Discount: మహీంద్రా ఈవీపై రూ.2 లక్షల భారీ డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి

స్కోడా కుషాక్ మోడల్‌పై భారీ డిస్కౌంట్..

స్కోడా కంపెనీకి చెందిన పాపులర్ ఎస్‌యూవీ కుషాక్ (Skoda Kushaq) పాత స్టాక్‌పై ఈ నెల అత్యధిక బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో రన్-అవుట్ వేరియంట్లయిన ఒనిక్స్, సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్, మాంటే కార్లో ట్రిమ్స్‌పై రూ. 2 లక్షల క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. దీనితో పాటు రూ. 50,000 కార్పొరేట్ లేదా లాయల్టీ బోనస్, అలాగే రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్ సపోర్ట్ లభిస్తుంది. దీనివల్ల కొన్ని సెలెక్టెడ్ వేరియంట్లపై మొత్తం బెనిఫిట్స్ రూ. 3 లక్షల వరకు చేరుకుంటాయి. మరోవైపు కొత్తగా వచ్చిన మై26 కుషాక్ యూనిట్లపై ఆఫర్లు పరిమితంగా ఉన్నాయి. సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్ వేరియంట్లపై ఎక్స్ఛేంజ్, లాయల్టీ స్కీమ్స్ ద్వారా రూ. 40,000 వరకు బెనిఫిట్స్ ఉండగా, టాప్-ఎండ్ ప్రెస్టీజ్, మాంటే కార్లో ట్రిమ్స్‌పై రూ. 20,000 వరకు ఆఫర్ లభిస్తుంది. క్లాసిక్ ప్లస్ వేరియంట్‌పై మాత్రం ఈ నెల ఎలాంటి ఆఫర్ లేదు.

Read Also: Hybrid Cars Mileage: ఇంధన ధరల టెన్షన్‌కు చెక్.. మార్కెట్లో బెస్ట్ హైబ్రిడ్ కార్లు ఇవే.. వర్కౌట్ అవుతుందా ?

స్లావియా , కైలాక్ మోడ‌ల్స్ పై..

స్కోడా స్లావియా (Skoda Slavia) సెడాన్ కార్ మై25, మై26 ఇన్వెంటరీలపై కూడా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పాత స్టాక్‌కు చెందిన ప్రెస్టీజ్ 1.0 టిఎస్ఐ ఎమ్టీ వేరియంట్‌పై అత్యధికంగా రూ. 50,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 50,000 కార్పొరేట్ బోనస్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ సపోర్ట్ లభిస్తున్నాయి. ప్రెస్టీజ్ ఏటీ వేరియంట్లపై కూడా రూ. 1.40 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్, మాంటే కార్లో వేరియంట్లపై ఎక్స్ఛేంజ్, లాయల్టీ ఆఫర్లు ఉన్నప్పటికీ క్యాష్ డిస్కౌంట్లు తక్కువగా ఉన్నాయి. కొత్త మై26 యూనిట్లపై వేరియంట్‌ను బట్టి రూ. 50,000 నుండి రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఇటీవల లాంచ్ అయిన కైలాక్ (Skoda Kylaq) కాంపాక్ట్ ఎస్‌యూవీపై ఆఫర్లు కాస్త తక్కువగా ఉన్నాయి. పాత మై25, మై26.1 స్టాక్‌లోని సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్ ట్రిమ్స్‌పై రూ. 50,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 కార్పొరేట్ బోనస్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ సపోర్ట్ ఇస్తున్నారు. కొత్త మై26.2 యూనిట్లపై చాలా వేరియంట్లకు రూ. 25,000 విలువైన ఎక్స్ఛేంజ్, లాయల్టీ ఆఫర్లు మాత్రమే లభిస్తాయి.

ఫ్లాగ్‌షిప్ కొడియాక్ ఎస్‌యూవీపై..

స్కోడా కంపెనీకి చెందిన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ కొడియాక్ (Skoda Kodiaq) పై ఈ మే నెలలో అందరికంటే అత్యధిక ఓవరాల్ బెనిఫిట్స్ లభిస్తున్నాయి. పాత మై25, మై26 వివై25 స్టాక్‌కు చెందిన స్పోర్ట్‌లైన్, సెలెక్షన్ ఎల్ అండ్ కే ట్రిమ్స్ కొనుగోలుపై రూ. 2 లక్షల భారీ క్యాష్ డిస్కౌంట్, రూ. 1 లక్ష కార్పొరేట్ బెనిఫిట్, రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తున్నాయి. ఇవన్నీ కలుపుకుంటే ఈ వేరియంట్లపై మొత్తం బెనిఫిట్ రూ. 3.50 లక్షల భారీ మార్కును చేరుకుంటుంది. లేటెస్ట్ మై26 వివై26 యూనిట్ల విషయానికి వస్తే ఆఫర్లు కొంచెం తక్కువగా ఉన్నాయి. సెలెక్షన్ ఎల్ అండ్ కే ట్రిమ్ పై రూ. 1.50 లక్షల వరకు కంబైన్డ్ ఆఫర్లు ఉండగా, స్పోర్ట్‌లైన్ వేరియంట్ పై కార్పొరేట్, ఎక్స్ఛేంజ్ స్కీమ్స్ ద్వారా రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్ అందుకోవచ్చు. కొత్త కారు కొనాలనుకునే వారికి ఈ మే నెల ఆఫర్లు ఒక మంచి అవకాశంగా నిలుస్తాయి.