Skin Cells to Babies : చర్మ కణాలతో పిల్లలను కనొచ్చా? షాకింగ్ రిజల్స్ ఇచ్చిన న్యూ స్టడీ, DNA ప్రాబ్లమ్ కూడా ఉండదట
2 months ago 3
ARTICLE AD
Human Skin Cells into Eggs with Stem Cell Technology : సంతాన సమస్యలతో ఇబ్బంది పడేవారికి.. ముఖ్యంగా మహిళల్లో ఎగ్స్ లేనివారికి గుడ్ న్యూస్ చెప్తోంది తాజా అధ్యయనం(Fertility Breakthrough 2025). వినూత్నంగా చర్మ కణాల నుంచి.. ప్రారంభ దశలోని మానవ పిండాలను సృష్టించండంలో యూఎస్ పరిశోధకులు  విజయాన్ని సాధించారు. క్లోనింగ్ పద్ధతుల్లో ఇది కూడా ఒకటిగా చెప్తున్నారు. మరి ఈ ప్రక్రియ ఎంతవరకు మంచిది? ఎలా చేస్తారు? దీనివల్ల ఇబ్బందులు ఉంటాయా? వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
స్కిన్ సెల్స్​తో స్టడీ
సాధారణంగా పురుషుడి నుంచి వచ్చే స్పెర్మ్, స్త్రీ నుంచి వచ్చే అండాన్ని ఫలదీకరణం చేస్తుంది. అది శిశువుగా అభివృద్ధి చెందే పిండంగా మారుతుంది. అయితే ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ అధ్యయనంలో భాగంగా కొత్త టెక్నిక్​ని ఉపయోగించింది. సెల్యూలార్ రీప్రోగ్రామింగ్, స్టెమ్ సెల్ టెక్నాలజీ (Stem Cell Technology) ద్వారా.. చర్మం కణం (Human Skin Cells) కింద ఉన్న కేంద్రకంలోని జన్యు పదార్థం తీసి.. దాని ద్వారా ఎగ్​ని డెవలెప్ చేసి సక్సెస్ అయ్యారు.
అమెరికాలోని Oregon Health & Science University శాస్త్రవేత్తలు DNA మానిప్యూలేషన్, ఫెర్టిలైజేషన్ పద్ధుతల ద్వారా.. ఎగ్స్​పై ఆధారపడకుండా.. పిండాలను ఉత్పత్తి చేయగలిగారు. ఇది వైద్యరంగంలో సంతానోత్పత్తిలో గణనీయమైన మార్పులు తెస్తుందని.. సంతానోత్పత్తి చికిత్సలను మరింత సమర్థవంతంగా మారుస్తుందని చెప్తున్నారు. వంధ్యత్వం, జన్యుపరమైన సమస్యలు, స్వలింగ సంబంధాల్లో ఉండేవారికి ఇది బెస్ట్ అంటున్నారు.
అధ్యయనంలోని హైలెట్స్​..
అధ్యయనంలో భాగంగా ఎగ్​లోని కొంత క్రోమోజోమ్ భాగాన్ని తీసేసి.. చర్మ కణాల్లోని న్యూక్లియస్​ని చేర్చి.. ప్రత్యేక కెమికల్స్, ఎలక్ట్రిక్ ఇంపల్స్ ద్వారా పూర్తి స్థాయిలో ఎగ్​ని రూపొందించి.. దానిని IVF పద్ధతిలో స్పెర్మ్​తో ఫెర్టిలైజ్ చేశారు. ఈ పద్ధతిలో ఎంబ్రియో  (embryo) వృద్ధి చెందడంపై పరిశోధకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పద్ధతి ద్వారా ఎగ్స్ సమస్య ఉన్న మహిళలకు, స్వలింగ జంటలకు, జన్యుపరమైన సమస్యలు ఉన్నవారికి సంతానం పొందే అవకాశం ఉంది.
వయసు ప్రభావం వల్ల ఎగ్స్ తగ్గుతున్న మహిళలకు, ఇతర ఆరోగ్య సమస్యలతో ఎగ్స్ దెబ్బతింటే వారికి ఈ పద్ధతి మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఇది కేవలం proof-of-concept మాత్రమేనని.. అంటే ఇప్పటికిప్పుడు వాడే టెక్నిక్ కాదని శాస్త్రవేత్తలు చెప్పుతున్నారు. ఈ పద్ధతిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇది సురక్షితమైనదే అయినా.. మరిన్ని పరిశోధనల అవసరం ఉందని చెప్తున్నారు. సక్సెస్ అయితే మాత్రం ఎందరికో ఇది మంచి ఫలితాలు ఇస్తుందని అంటున్నారు.
Read Entire Article