<p>ముస్తాబాద్: సొంత ఇల్లు లేకపోవడంతో ఓ కుటుంబం మృతదేహంతో రాత్రంతా అంబులెన్స్‌లో గడపాల్సి వచ్చింది. సంతోష్ అనే చేనేత కార్మికుడు అనారోగ్యంతో చనిపోగా, హాస్పిటల్ నుంచి మృతదేహాన్ని అద్దె ఇంటికి తీసుకెళ్లారు. కానీ మృతదేహాన్ని ఇంట్లో ఉంచే పరిస్థితి లేకపోవడంతో రాత్రంతా అంబులెన్స్ లోనే ఉంచారు. ఆయన పిల్లలు కూడా అందులోనే రాత్రంతా గడపాల్సి వచ్చింది. గ్రామస్తులు సాయం చేయడంతో చేనేత కార్మికుడి మృతదేహాన్ని బయటకు తీసి అంత్యక్రియలు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ హృదయ విదారకర ఘటన జరిగింది. </p>