Singer Jhansi: బిగ్‌బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష హోరాహోరీగా సాగుతోంది. హౌస్‌లోకి వెళ్లేందుకు కామనర్స్ కేటగిరీ నుంచి 15 మంది పోటీ పడుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే బిగ్ బాస్ 10 ప్రారంభం కానుంది. అగ్నిపరీక్ష టాస్కుల్లో రైతుబిడ్డ, సింగర్ ఝాన్సీ తన ప్రతిభను చూపిస్తున్నారు. తమ పొలంలో పంట, రైతుల కష్టాలను వివరిస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయింది ఝాన్నీ. ‍అలాగే తన పాటలతోనూ ఆకట్టుకుంటుంది. బిగ్‌బాస్ ఛాన్స్ కోసం అగ్నిపరీక్ష టాస్క్‌ల్లో గట్టి పోటీ ఇస్తుంది. ఝాన్సీ రియల్ లైఫ్, ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

రియల్ లైఫ్

ఝాన్సీ ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన గ్రామీణ నేపథ్యం ఉన్న అమ్మాయి. ఆమె సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలానికి చెందిన కోమటికుంట గ్రామంలో పుట్టింది. ఎలాంటి సంగీత నేపథ్యం, ఆసరా లేకపోయినా, స్వయంకృషితో జానపద పాటలు పాడుతూ తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. ఆమె కేవలం ఓ సింగర్ మాత్రమే కాదు, చదువుల్లోనూ రాణించింది. పీజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసింది. పొలంలో పనులు చేస్తూనే ఇంటర్‌లో 926 మార్కులు సాధించింది.

కెరీర్ & గుర్తింపు

తెలంగాణ జానపద పాటలను పాడి యూట్యూబ్‌లో భారీ వ్యూస్ సాధించింది ఝాన్సీ. రామ్‌రెడ్డి దొర, అడ్డా బాటలకాడ నల్ల సారంగులయ్య, అందాల రాధ, కాసరం కట్ట వంటి జానపదాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన మాస్, ఎనర్జెటిక్ వాయిస్‌తో నెటిజన్లను, జానపద ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.

Also Read: రియల్ లైఫ్‌లో కూల్.. అగ్నిపరీక్షలో హాట్!.. ఎవరీ 'కామనర్' రోహిత్ నాయుడు?

సోషల్ మీడియా

ఝాన్సీ పాడిన పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంటాయి. సోషల్ మీడియాలో తన జానపద పాటలు, ప్రదర్శనల ద్వారా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

Also Read: 'ఆటో' రాంప్రసాద్.. జబర్దస్త్ పంచ్‌ల రాజా.. కెరీర్ విశేషాల నుంచి బిగ్ బాస్ ఎంట్రీ వరకు!

బిగ్ బాస్ అగ్నిపరీక్ష

బిగ్ బాస్ 10 మెయిన్ హౌస్‌లోకి వెళ్లడానికి నిర్వహిస్తున్న 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2' కాంటెస్ట్‌లో 15 మంది షార్ట్‌లిస్ట్ అయిన కామనర్స్‌లో ఝాన్సీ ఒకరు. అగ్నిపరీక్ష షోలో శ్రీముఖి హోస్టింగ్‌లో నవదీప్, అభిజీత్, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఝాన్సీ టాస్కుల్లో తన కసిని చూపుతూ, ఆడియన్స్, జడ్జిల దృష్టిని ఆకర్షించి టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా స్థానం సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది. అగ్నిపరీక్ష ద్వారా ఎంపికయ్యే 5-6 మంది కామనర్స్‌లో ఒకరిగా నిలిచి బిగ్ బాస్ మెయిన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు గట్టి పోటీ ఇస్తోంది.

Also Read: ఎవరీ షాలిని పటేల్?.. బిగ్ బాస్‌లో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్!