<p>హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా బోనస్ ప్రకటించింది. సింగరేణి లాభాల్లో 34 శాతం బోనస్‌ (రూ.819 కోట్లు)ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సింగరేణి 2024-25 ఆర్ధిక సంవత్సరంలో సాధించిన లాభాలలో కార్మికులకు వాటా ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించారు. రెగ్యూలర్ కార్మికులకు రూ.1,95,610 బోనస్ ప్రకటించగా.. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.</p>
<p><br />ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, ఎంపీలు బలరాం నాయక్, రఘురాం రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.</p>