Shukra Gochar 2026: మిథునంలోకి శుక్రుడు! ఈ 5 రాశులవారికి సంపద, వైవాహిక జీవితంలో ఆనందంతో పాటూ అపురూపమైన వరాలందుతాయి!

3 weeks ago 5
ARTICLE AD

Shukra Gochar  In Gemini 2026:  నెల రోజులకోసారి రాశి పరివర్తనం చెందే శుక్రుడు మే 14న బుధుడి రాశి అయిన మిథునంలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు అపారమైన సంపద, విలాసవంతమైన జీవితం, వైవాహిక జీవితంలో ఆనందానికి సూచన. శుక్రుడు సంచారం బావుంటే జీవితంలో సంతోషం ఉన్నట్టే. మే 14 ఉదయం మిథున రాశిలోకి ప్రవేశించే శుక్రుడు..జూన్ 8 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు. ప్రస్తుతం గురుడు కూడా  మిథున రాశిలో ఉన్నాడు. దీనివల్ల దశాంక యోగం ఏర్పడుతుంది, ఇది కొన్ని రాశుల వారికి అభివృద్ధిని , అపారమైన సంపదను తెస్తుంది.

వృషభ రాశి ( Taurus )

మిథున రాశిలో శుక్రుడి సంచారం వృషభ రాశివారికి అద్భుతంగా కలిసొస్తుంది.  జాతకంలో సంపద, వాక్చాతుర్యం , కుటుంబానికి సంబంధించిన రెండవ భావమైన వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు. మీకు సంపద మార్గాలు తెరుచుకుంటాయి .. కార్యాలయంలో మీ మాటలకు, మీ పనితీరుకి అధికారులు ముగ్ధులవుతారు. మీకు పదోన్నతి లభించవచ్చు.

కర్కాటక రాశి ( Cancer)

మిథునంలో శుక్రుడి సంచారం కర్కాటక రాశివారికి శుభ ఫలితాలను ఇస్తుంది.  శుక్రుని శుభ ప్రభావంతో ఈ నెలలో ఆదాయం పెరుగుతుందంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. స్నేహితుల మధ్య సంబంధాలు, వారి మద్దతు ప్రయోజనకరంగా ఉంటాయి. పెట్టుబడులు కూడా మంచి రాబడిని ఇచ్చే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునేముందు మీ సన్నిహితులతో చర్చిస్తే మంచి ఫలితాలుంటాయి.

సింహ రాశి (Leo)

సింహరాశి వారికి, శుక్రుడు మిథునరాశిలోకి ప్రవేశించడం అత్యంత శుభప్రదం. ఈ సంచారం మీ జాతకంలోని పదకొండవ ఇంట్లో జరుగుతుంది కాబట్టి.. కొన్నాళ్లుగా అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. మీ పిల్లల విజయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి సహోద్యోగుల మద్దతు మీకు సహాయపడుతుంది. అనుకున్నపనులన్నీ ఈ నెలలో పూర్తిచేయగలుగుతారు

కన్యా రాశి (Virgo)

కన్యారాశి వారికి, శుక్రుడు మిథునరాశిలోకి ప్రవేశించడం వృత్తి , వ్యాపారంలో కొత్త ప్రారంభాలకు శుభ సమయంగా చెబుతారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.  ఉద్యోగం మారాలని, కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలని లేదా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్న వారు సానుకూల ఫలితాలను చూడవచ్చు.

కుంభ రాశి (Aquarius)

మిథునంలో శుక్రుడి సంచారం కుంభ రాశివారికి కూడా ఆర్థిక , కెరీర్ ప్రయోజనాలను అందిస్తుంది. మే నెలలో, శుక్రుడు కుంభ రాశిలోని ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మీకు ఊహించిన దానికంటే మెరుగైన విద్యా ఫలితాలు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఉద్యోగావకాశాలు లభించవచ్చు. మీ సామర్థ్యాల వల్ల మీ కీర్తి పెరుగుతుంది. డబ్బు సంపాదించడానికి అవకాశాలు లభిస్తాయి.

ఏలినాటి శని సమయంలోనూ ఈ రాశులవారు ఆనందంగా ఉంటారు, కెరీర్లో పురోగతి ఉంటుంది!

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Read Entire Article