<p><strong>Ind Vs Eng 3rd Odi Live Updates:</strong> అద్భుత‌మైన ఫామ్ లో ఉన్న ఓపెన‌ర్ శుభ‌మాన్ గిల్ సూప‌ర్ సెంచ‌రీ (95 బంతుల్లో 102 నాటౌట్, 14 ఫోర్లు, 2 సిక్సర్లు)తో స‌త్తా చాటాడు. గురువారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్ కు శుభారంభాన్ని గిల్ అందించాడు. రోహిత్ శ‌ర్మ (1) విఫ‌ల‌మైనా.. స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ (52)తో క‌లిసి జ‌ట్టును ముందుకు న‌డిపించాడు. ఈ మ్యాచ్ లో ఫిఫ్టీ కొట్టి కోహ్లీ కూడా ఫామ్ లోకి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రూ రెండో వికెట్ కు 116 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యం న‌మోదు చేశారు. సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్ లో గిల్ ఆల్రెడీ రెండు అర్థ సెంచ‌రీలు చేయ‌గా, ఇది సెంచ‌రీ కావడం విశేషం. తన వ‌న్డే కెరీర్లో ఇది 7 వ సెంచ‌రీ. గిల్ త‌న ఇన్నింగ్స్ లో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌పై ఆధిప‌త్యం సాధించి 14 ఫోర్లు, 2 సిక్స‌ర్లు చేశాడు. ఇక 2023 సెప్టెంబ‌ర్ త‌ర్వాత గిల్ సెంచ‌రీ చేయ‌డం ఇదే ప్ర‌థ‌మం కావ‌డం విశేషం. </p>
<p> </p>