IT department Shock for Gold Men: ఒంటిపై కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించి, సోషల్ మీడియాలో తెలంగాణ గోల్డ్ మెన్ గా గుర్తింపు పొందిన వారిపై ఆదాయపు పన్ను శాఖ (I-T) కొరడా ఝళిపిస్తోంది. తాజాగా గచ్చిబౌలికి చెందిన యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ నివాసంలో ఐటీ అధికారులు జరిపిన తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సోషల్ మీడియా ప్రోఫైలింగ్ ఆధారంగా జరిగిన ఈ దాడుల్లో సుమారు ఒక కోటి రూపాయల విలువైన బంగారాన్ని అధికారులు గుర్తించారు.

దేశంలోనే తొలిసారిగా కొత్త చట్టం ప్రయోగం!

ఈ కేసు కేవలం బంగారం స్వాధీనం చేసుకోవడానికే పరిమితం కాలేదు. ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం - 2025 లోని సెక్షన్ 247 కింద దేశంలోనే జారీ చేయబడిన మొదటి వారెంట్ ఇదే కావడం గమనార్హం. గతంలో అమల్లో ఉన్న 1961 నాటి చట్టంలోని సెక్షన్ 132 స్థానంలో ఇప్పుడు ఈ కొత్త నిబంధనలను అధికారులు ప్రయోగించారు. గచ్చిబౌలి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, స్థానిక నాయకుడిగా చలామణి అవుతున్న చిన్న పహిల్వాన్ వద్ద మొత్తం 900 గ్రాముల బంగారం ఉండగా, అందులో 700 గ్రాములకు సంబంధించి ఎలాంటి లెక్కలు చూపకపోవడంతో ఐటీ శాఖ దాన్ని సీజ్ చేసింది. మిగిలిన 150-200 గ్రాములను వ్యక్తిగత అవసరాల కోసం వదిలిపెట్టారు. కేవలం 4 లక్షల వార్షిక ఆదాయాన్ని మాత్రమే రిటర్న్స్‌లో చూపిస్తూ, కోట్లాది రూపాయల ఆస్తులు, కిలోల కొద్దీ బంగారం ధరించడంపై అధికారులు ఆయన్ని ప్రశ్నించారు.

సోషల్ మీడియా నిఘా

ఐటీ శాఖ రాడార్‌లో చిక్కుకున్న మూడో గోల్డ్ మెన్ చిన్న పహిల్వాన్. అంతకుముందు కొండ విజయ్‌కుమార్ అనే వ్యక్తి వద్ద కూడా భారీగా లెక్కల్లో లేని బంగారాన్ని సీజ్ చేశారు. సూర్య భాయ్ అనే వ్యక్తి హడావుడి చూసి అధికారులు దాడులు చేయగా, ఆయన ధరించిన ఆభరణాల్లో ఎక్కువ భాగం రోల్డ్ గోల్డ్, పూత పోయించినవని తేలడం చర్చనీయాంశమైంది. టీవీ ఇంటర్వ్యూలు, యూట్యూబ్ హోమ్ టూర్ వీడియోలు, సోషల్ మీడియా రీల్స్‌ను నిశితంగా పరిశీలిస్తున్న ఐటీ విభాగం.. వ్యక్తుల జీవనశైలికి, వారు చెల్లిస్తున్న పన్నులకు పొంతన లేకపోతే వెంటనే దాడులకు సిద్ధమవుతోంది.

Third ‘Gold Man’ under I-T scanner in Hyderabad:₹1 crore gold haul

This time real gold

Another “gold man” has come under the Income Tax Department’s scanner, with the Hyderabad investigation unit seizing gold worth about ₹1 crore from Yadgiri Chinna Goud alias Dargah Chinna… pic.twitter.com/RMURVZ4xlV

— Sudhakar Udumula (@sudhakarudumula) April 3, 2026

పట్టిస్తున్న సోషల్ మీడియా

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో లైకులు, ఫాలోవర్ల కోసం ఆస్తులను ప్రదర్శించడం ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖకు ఇన్విటేషన్ ఇచ్చినట్లు అవుతోంది. రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లు, జీపీఏ లావాదేవీల ద్వారా నగదు రూపంలో సంపాదిస్తూ, బంగారంగా మార్చుకుంటున్న వారిపై అధికారులు ఇకపై మరింత కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి.