Shikhar Dhawan Marriage Photos | భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, తన గాళ్‌ఫ్రెండ్ సోఫీ షైన్‌ను వివాహం చేసుకున్నారు. మొదటి భార్య ఆయేషా ముఖర్జీతో విడాకుల తర్వాత, కుమారుడు దూరమయ్యాడని ధావన్ కొంతకాలం మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఐర్లాండ్‌కు చెందిన సోఫీతో డేటింగ్‌ చేశాడు. వీరిద్దరూ తొలిసారి దుబాయ్‌లో కలుసుకున్నారు. 40 ఏళ్ల ధావన్, సోఫీ షైన్ వివాహం ఫిబ్రవరి 21న ఘనంగా జరిగింది.

ఈ వేడుకకు టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దేతో కలిసి హాజరయ్యారు. సురేష్ రైనా, యుజ్వేంద్ర చాహల్ సైతం గబ్బర్ వివాహ వేడుకకు విచ్చేసి సందడి చేశారు. విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ధావన్‌కు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ధావన్ తన పెళ్లి వేడుక ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దేతో కలిసి శుక్రవారమే ఢిల్లీకి చేరుకున్నాడు. వీరిద్దరూ ధావన్, సోఫీ షైన్ వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రోహిత్, ధావన్ టీమిండియాకు ఓపెనర్లుగా సేవలు అందించారు. మైదానం బయట కూడా వీరి ఫ్రెండ్‌షిప్ కొనసాగింది. ఇర్ఫాన్ పఠాన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సహా పలువురు క్రికెట్ ప్రముఖులు, ధావన్, సోఫీ కుటుంబసభ్యులు, సన్నిహితులు ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.

మాజీ క్రికెటర్ సురేష్ రైనా కూడా తన భార్యతో కలిసి శిఖర్ ధావన్ వివాహానికి హాజరై, సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. ధావన్ వివాహానికి హాజరై తన మాజీ సహచరుడితో తన అనుబంధాన్ని షేర్ చేసుకున్నాడు.

Rohit Sharma × Shikhar Dhawan! ❤

- The Re - Union of Indian opening pairs. pic.twitter.com/WjxT87Ha1l

— Rohit Sharma Fan (@hitmanfanfollow) February 22, 2026

ధావన్‌కు విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు
విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన భార్య అనుష్క శర్మతో కలిసి భారత్‌లో ఉన్నాడు. వారి ఎయిర్‌పోర్ట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధావన్ పెళ్లికి కోహ్లీ హాజరుకానప్పటికీ, ఇన్‌స్టాగ్రామ్‌లో తన సహచరుడికి శుభాకాంక్షలు తెలిపారు.

Virat kohli congratulating Shikhar Dhawan. pic.twitter.com/zJP8htMfVI

— Cricklover (@kumarmanoj_11) February 22, 2026

శిఖర్ ధావన్ క్రికెట్ కెరీర్
2010లో అంతర్జాతీయ అరంగేట్రం (వన్డే) చేసిన శిఖర్ ధావన్, 29 జూలై 2021న తన చివరి అంతర్జాతీయ (టీ20) మ్యాచ్ ఆడాడు. తన 11 ఏళ్ల కెరీర్‌లో ధావన్ టీమిండియా తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 2315 పరుగులు చేసిన ధావన్, వన్డేల్లో 6793 రన్స్ తో రాణించాడు. పొట్టి ఫార్మాట్‌లోనూ 1759 పరుగులతో తనదైన ముద్ర వేశాడు. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంలో రోహిత్ శర్మతో కలిసి కీలకపాత్ర పోషించాడు.

శిఖర్ ధావన్ 2012లో ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకోగా, మనస్పర్థల వల్ల 2023లో విడాకులు తీసుకున్నారు. కుమారుడు జోరావర్‌కు దూరమై ఒంటరిగా ఉన్న ధావన్, సోఫీ షైన్‌ను రెండో వివాహం చేసుకోవడంతో ఆయన జీవితంలో మళ్ళీ సంతోషం మొదలైందని గబ్బర్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే కుమారుడు జోరావర్ తన వద్ద లేడని, అతడ్ని చూడలేకపోతున్నానని ధావన్ కొన్నేళ్లుగా ఎంతో వేదన అనుభవించాడని తెలిసిందే.