Satyabhama Serial Today Episode కరెంట్ ఆఫీస్‌ నుంచి మహదేవయ్య కాల్ వస్తుంది. మీ అబ్బాయి కూడా నాకు బెదిరించాడు సత్య కన్నవారి ఇంటికి కరెంట్ ఇచ్చేస్తా అని చెప్తాడు. దాంతో మహదేవయ్య మరేం అనడు. కరెంట్ వస్తే వచ్చింది కానీ దెబ్బ మీద దెబ్బ కొడతా అని అనుకుంటాడు. ఇక భైరవి కాఫీ తీసుకొని వస్తుంది. చిన్న కోడలు పుట్టింట్లో తిష్ట వేసిందని అత్తింటికి సున్నం కొడుతుందని కోప్పడుతుంది.

మహదేవయ్య: నాకు తెలీకుండా నిన్ను ఆ ఇంటికి ఎవరు పొమ్మన్నారే. సరే కానీ రాసి పెట్టుకో కొన్ని దినాలు చిన్న కోడలు పుట్టిళ్లు వదిలి రాదు. పనులన్నీ నువ్వే చేసుకో.
భైరవి: నా వల్ల కాదు.
మహదేవయ్య: అయితే ఆమెను పిలిపిస్తాలే..
భైరవి: ఎవరిని
మహదేవయ్య: గంగని అని పెద్దగా నవ్వుతాడు. భైరవి బుంగ ముఖం పెట్టుకుంటుంది. తను వస్తే నీకు సాయంగా ఉంటుందే.
భైరవి: నాకు హెల్ప్‌గా ఉంటుందా నీకు హెల్ప్‌గా ఉంటుందా ఇదిగో పెనిమిటి ఇంకోసారి ఆ గంగ పేరు పెట్టకు.
మహదేవయ్య: కోడలు కాని కొడలా నువ్వేమో కానీ నేను మాత్రం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నా.
క్రిష్: ఓయ్ మరదల్స్, బామ్మర్ది పవర్ వచ్చిందా లేదు.
సంధ్య: మీ పవర్‌కి పవర్ వచ్చింది బావ.

నందిని బెదిరించావా అన్న అంటే అంత వరకు నేను ఉండగా తీసుకురాను నందిని అంటుంది. ఇక విశాలాక్షి క్రిష్‌కి థ్యాంక్స్ చెప్తుంది. సత్య తన వాళ్లతో క్రిష్‌ ఈ ఇంటి గడప అని కష్టాలు గడప దాటి రానివ్వడని అంటుంది. దానికి క్రిష్ సత్య మా బాపునే డామినేట్ చేస్తుందని అంటాడు. సత్య మనసులో నీ కోసం మీ బాపుతో నేను చేస్తున్న యుద్ధం ఫలితమే నా పుట్టింటికి ఈ కష్టాలు అని అనుకుంటుంది. ఇంతలో 25లక్షలు ఇవ్వమని రౌడీలు వస్తారు. క్రిష్‌ ఫైర్ పడుతుంటే విశ్వనాథం క్రిష్‌ని ఆపి నేను గడువు పెట్టాను నేను మాట్లాడుతాను అని చెప్తాడు. ఇంకొక్క వారం ఆగమని విశ్వనాథం చెప్తే ఆ రౌడీలు ఇంట్లో సామాను ఎత్తుకెళ్లిపోతాం అంటాడు. బతిమాలుతున్న విశ్వనాథాన్ని ఆ రౌడీ నెట్టేస్తే విశ్వనాథం క్రిష్‌ మీద పడిపోతాడు. దాంతో క్రిష్ రౌడీలను చితక్కొడతాడు. ఇంట్లో అందరూ క్రిష్‌ని ఆపడానికి ప్రయత్నిస్తారు. విశ్వనాథం గొడవ వద్దని అల్లుడికి రెండు చేతులు ఎత్తి దండం పెడతాడు.

విశ్వనాథం క్రిష్‌ని ఆపుతాడు. మామ ఆపాడు కాబట్టి ఆగుతున్నా అంటాడు. ఇక రౌడీలను గంట ఆగమని చెప్పి నేను ఇంటి కెళ్లి డబ్బు తీసుకొస్తా అని అంటాడు. విశ్వనాథం వద్దని అంటే ఇది నా సమస్య నేను వచ్చే వరకు ఎవరు ఏం చేయొద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. సత్య కూడా క్రిష్‌కి అడ్డు చెప్పదు. ఇక హర్ష టెన్షన్ బయట చిరాకు పడితే నందిని వస్తుంది. రౌడీలు నట్టింట్లో కూర్చొంటే మండిపోతుందని చిన్నన్న డబ్బు తెస్తే అప్పుడు వాళ్ల సంగతి చెప్తా అంటుంది. ఇంతలో హర్షకి మైత్రి కాల్ చేస్తుంది. అప్పటికే ఫుల్ ఫైర్‌లో ఉన్న నందిని ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది. ఏంటి తల్లి చేసింది సరిపోవడం లేదా ఇంకేం చేయాలనుకున్నావ్ అని విషయం చెప్తుంది. మీ కోసం ఏమైనా చేస్తా అని మైత్రి అంటే నీ వల్లే కష్టాలు మళ్లీ మా జోలికి రాకు అంటుంది. హర్ష కాల్ కట్ చేసి నందినికి చివాట్లు పెడతారు. ఇద్దరూ గొడవ పడతారు. నువ్వొక మూర్ఖురాలివి అంటాడు. ఇంతలో సత్య వచ్చి మూర్ఖంగా ప్రవర్తిస్తుంది నువ్వు వదిన కాదు అని అన్నని తిడుతుంది. దిగజారి పోయి మాట్లాడుతున్నావ్ అని భార్యని తిట్టడం తప్పు అంటుంది. దాంతో హర్ష ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు.

క్రిష్ ఇంటికి వెళ్తాడు. నీ పెళ్లాన్ని తీసుకొస్తా అన్నావ్ రాలేదు ఏంట్రా అంటే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టానా ఏంటి నేను కూడా మళ్లీ పోతున్నా అంటాడు. ఇక క్రిష్ మహదేవయ్యకి 25 లక్షలు అడుగుతాడు. మహదేవయ్య ఏం మాట్లాడకుండా ఉంటే భైరవి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఇక జయమ్మ వచ్చి ఈ ఇంటి కోడలు సమస్యలో ఉంటే మనమే ఆదుకోవాలని అంటుంది. మహదేవయ్య ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్తాడు. బ్యాగ్‌లో డబ్బు తీసుకొచ్చి ఇస్తాడు. భైరవి ఏం అడగకుండా అలా ఇచ్చావేంటి అంటే నా కోసం చిన్నా ఏమైనా చేస్తాడు నేను వాడి కోసం ఏమైనా చేస్తా అంటాడు. ఇక క్రిష్ బాపు నువ్వు నాకు తండ్రి కంటే ఎక్కువ అని చెప్పి డబ్బు తీసుకెళ్తాడు. మహదేవయ్య మనసులో నా ప్లాన్స్ నాకు ఉంటాయిరా బిడ్డా అనుకుంటాడు. క్రిష్ డబ్బు తీసుకొని సత్య పుట్టింటికి వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: సత్యభామ సీరియల్: సత్య పుట్టింటికి వచ్చి రచ్చ చేసిన భైరవి.. సత్యకి మహదేవయ్య మాస్ వార్నింగ్‌!