Saturday Remedies for Planetary Dosha: జీవితంలో చికాకులు వెంటాడుతున్నా, అనుకున్న పనులు సమయానికి పూర్తికాకున్నా, గ్రహదోషాలు తరుముతున్నా ప్రతి శనివారం ఈ మూడింటింకి ప్రదక్షిణ చేస్తే చాలు..చాలా సమస్యల నుంచి మానసికంగా ఉపశమనం లభిస్తుందని పండింతులు చెబుతున్నారు.

శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజిస్తారు..శ్రీ మహావిష్ణువు కలియుగంలో వేంకటేశ్వరస్వామిగా భక్తులను కరుణిస్తున్నాడు. శనివారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు. అయితే ఈ రోజు కొన్ని పనులు చేస్తే ...తెలియక చేసినా పాపాలన్నీ హరించుకుపోవడంతో పాటూ బాధలు తొలగి సుఖసంతోషాలు మీ సొంత అవుతాయి

రావి చెట్టు

రావి చెట్టును అశ్వత్థ వృక్షం అంటారు. దీనిని విష్ణు స్వరూపంగా భావించి పూజలు చేస్తారు

రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు

"ఓం నమో భగవతే వాసుదేవాయ" లేదా "మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతశ్శివరూపాయ వృక్షరాజాయతే నమః" అనే మంత్రాన్ని పఠించాలి

ప్రతి శనివారం రావిచెట్టుకి మూడు ప్రదక్షిణలు చేస్తే శనిదోషాలు తొలగిపోతాయని, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ చెట్టుకింద దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కుతుందని నమ్మకం

హనుమంతుడు

శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామికేకాదు..ఆంజనేయుడికి కూడా ఎంతో ఇష్టం. గ్రహదోషాలు ఉండేవారు మంగళవారం కన్నా శనివారం రోజు హనుమంతుడి పూజ చేస్తే విముక్తి లభిస్తుందట. ఎన్నో బాధల నుంచి ఉపశమనం అందిస్తాడు ఆంజనేయుడు. తీరని కోరికలు, అనారోగ్య సమస్యలు తీరాలంటే ఆంజనేయుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి

యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిం|
భాస్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకం||

వేంకటేశ్వర స్వామి

శ్రీ వేంకటేశ్వరుడికి శనివారం ఎంతో ప్రీతికరం. ఈ రోజు వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి 7 ప్రదక్షిణలు చేస్తే అదృష్టం కలిసొస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం దక్కుతుందట.

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి |
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ||

తులసి పూజ

తులసి పూజ కేవలం శనివారం మాత్రమే కాదు..నిత్యం ఆచరిస్తే ఆ ఇంట్లో ఎలాంటి ప్రతికూల శక్తులు ఉండవని పండితుల మాట. తులసిని పూజిస్తే ఈ జన్మలో చేసిన పాపాలు మాత్రమే కాదు గత జన్మలో చేసిన పాపాలు కూడా హరించుకుపోతాయని పెద్దలు చెబుతారు. వివాహితులకు సౌభాగ్యాన్ని, వైవాహిక జీవితంలో సంతోషాన్ని అందిస్తుంది తులసి పూజ. తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి నిత్యం మూడు ప్రదక్షిణలు చేస్తే చాలు.. ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుందని చెబుతారు

తులసి మొక్క ముందు చేయాల్సిన ప్రార్థన

యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వ దేవతాః |
యదగ్రే సర్వ వేదాశ్చ తులసీం తాం నమామ్యహం ||

తులసి గాయత్రి

ఓం తులసీదేవ్యై చ విద్మహే
విష్ణుప్రియాయై చ ధీమహి
తన్నో వృందా ప్రచోదయాత్

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

<a title="ఉగాది రాశి ఫలాలు 2026-27 : మేష రాశి వారికి ప్రమాదాలు, నష్టాలు! మీ జీవితంపై పరాభవ నామ సంవత్సరం ప్రభావం!" href="https://telugu.abplive.com/spirituality/mesha-rashi-parabhava-nama-samvatsaram-results-2026-2027-career-prospects-and-financial-outlook-238886" target="_self">ఉగాది రాశి ఫలాలు 2026-27 : మేష రాశి వారికి ప్రమాదాలు, నష్టాలు! మీ జీవితంపై పరాభవ నామ సంవత్సరం ప్రభావం!

ఉగాది 2026 పరాభవ నామసంవత్సరంలో మీ రాశి ఆదాయం - వ్యయం తెలుసుకోండి!

2026 ఉగాది ఎప్పుడు? రాబోతున్న తెలుగు సంవత్సరం పేరేంటో తెలుసా!