Sankranti 2026 Telugu Movies: సంక్రాంతి సినిమాలకు జోనర్ సమస్య... థియేటర్లలోకి వచ్చేవి అన్నీ కామెడీ మూవీలే

3 months ago 8
ARTICLE AD

సంక్రాంతి సినిమాలు ప్రమోషన్స్ మొదలుపెట్టేసాయి. మెగాస్టార్, రెబల్ స్టార్లు మొదలు నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ వరకూ ఈసారి బరిలో ఉన్నారు. సాధారణం గా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు వాటికి క్లాష్ లేకుండా జాగ్రత్త పడతారు. కానీ సంక్రాంతికి మాత్రం ఎప్పుడు మూడు నాలుగు సినిమాలు బరిలో ఉంటాయి. ప్రేక్షకులు పండుగ ఉత్సాహంలో అన్ని సినిమాలు చూస్తారని దర్శక నిర్మాతలు నమ్మకంతో ఉంటారు. అయితే వారంతా తమ సినిమాల జోనర్లు ఒకదానికి ఒకటి డిఫరెంట్ గా ఉండేలా మాత్రం జాగ్రత్త పడతారు. అప్పుడు ప్రేక్షకులకి రకరకాల ఛాయిస్ లు ఉంటాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ కృష్ణ కాలం నుంచి ఇప్పటివరకు అదే ఫార్ములా నడుస్తుంది. కానీ ఫస్ట్ టైం 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో చాలావరకు ఒకే జోనర్ కావడం ఇప్పుడు మేకర్స్ ను భయపడుతోంది. అన్ని కామెడీ ఎంటర్టైనర్లుగానే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.

సంక్రాంతి సినిమాలన్నీ ఒకే జోనర్... కామెడీ
సంక్రాంతికి ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' వస్తోంది. ఇది హారర్ కామెడీ. ఎప్పుడో షూటింగ్ జరుపుకున్నా సాంకేతిక కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు దాన్ని సంక్రాంతి బరిలో జనవరి 9న దింపుతున్నారు. తరువాతి మూడు రోజుల గ్యాప్ లో జనవరి 12న మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు' రిలీజ్ ఉంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ కావడం... విక్టరీ వెంకటేష్ ముఖ్య పాత్రలో కనిపించనుండడం దీనిపై హైప్ పెంచింది. ఇదీ కామెడీ ఎంటర్టైనరే. ఆ తెల్లారి అంటే జనవరి 13న రవితేజ 'భర్త మహా శయులకు విజ్ఞప్తి' రిలీజ్ ఉంది. రవితేజ కూడా మాస్ యాంగిల్ పక్కన పెట్టి కామెడీ ఎంటర్టైనర్ జోనర్ ఎంచుకున్నారు. జనరరి 14న నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒకరాజు', శర్వానంద్ 'నారీనారీ నడుమ మురారీ' రిలీజ్ అవుతున్నాయి. ఇవి రెండూ కూడా కామెడీ ఎంటర్టైనర్లే. దానితో ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఉన్న అన్ని సినిమాలు ఒకే జోనర్ తో వస్తుండడంతో యాక్టర్లు మారతారు తప్ప అన్నీ కామెడీ సినిమాలే అయిపోతున్నాయి. ప్రేక్షకులకు వేరే ఛాయిస్ లేకుండా పోతోంది. ఇప్పుడు సంక్రాంతి సినిమాల మేకర్స్ ను కాస్త కలవరు పెడుతోంది అన్న వార్తలు ఫిల్మ్ నగర్ నుండి వెలువడుతున్నాయి.

Also Read: The Raja Saab Director: ప్రభాస్ మీడియం రేంజ్ హీరోనా? కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన 'ది రాజా సాబ్' దర్శకుడు మారుతి

ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు
సంక్రాంతి 2025 తీసుకుంటే 'గేమ్ చేంజర్' (పొలిటికల్ థ్రిల్లర్ ), 'డాకు మహారాజ్' (యాక్షన్ ), 'సంక్రాంతికి వస్తున్నాం' (కామెడీ ఎంటర్టైనర్ ) రిలీజ్ అయ్యాయి. సంక్రాంతి 2024కి 'గుంటూరు కారం' (యాక్షన్ ఎంటర్టైనర్), 'హను-మాన్' (సోషియో ఫాంటసీ సూపర్ హీరో), 'సైంధవ్' (యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్) రిలీజ్ అయ్యాయి. 2023లో కూడా 'వీర సింహా రెడ్డి' (ఫ్యాక్షన్ ), 'వాల్తేర్ వీరయ్య' ( యాక్షన్ కామెడీ ), 'కళ్యాణం కమనీయం' (రొమాంటిక్  డ్రామా ) సంక్రాంతి కివచ్చాయి. ప్రతి ఏడాదీ డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ సినిమాలు సంక్రాంతి పండుగ రోజుల్లో ఆడియన్స్ ను పలకరిస్తున్నాయి. 2026 సంక్రాంతికి మాత్రం ప్రేక్షకులకు ఆ ఛాయిస్ లేకుండా పోయింది. బడా స్టార్లు రంగంలో ఉన్నా అన్ని సినిమాలు ఒకే జోనర్ కావడంతో  ప్రేక్షకులు ఏ సినిమా వైపు మొగ్గు చూపుతారో చూడాలి.

Also Read: ప్రభాస్ 'రాజా సాబ్' కాదు... జనవరి 2026లో ఈ హాలీవుడ్ సినిమాలూ థియేటర్లలోకి వస్తున్నాయ్

Read Entire Article