Maruti Brezza Turbo real mileage: కారు కొనేటప్పుడు దాని ధరతో పాటు మైలేజ్ కూడా ముఖ్యమైన అంశమే. ముఖ్యంగాయయ పెట్రోల్ కార్ల విషయంలో కంపెనీ ప్రకటించే మైలేజ్ కంటే వాస్తవంగా అసలైన రోడ్లపై ఎంత ఇంధన సామర్థ్యం ఇస్తుందో తెలుసుకోవాలని వినియోగదారులు ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో Maruti Suzuki Brezza 1.0-litre Boosterjet Turbo Petrol వేరియంట్ రియల్ వరల్డ్ మైలేజ్ పరీక్షలో ఆసక్తికరమైన ఫలితాలు సాధించింది.

Maruti Fronx తర్వాత ఇప్పుడు Brezzaలోనూ 1.0-litre టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ఉంది. అయితే Fronxలో ఈ ఇంజిన్‌తో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండగా, Brezzaలో మాత్రం 6-speed మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంది.

ఎక్స్‌పర్ట్‌లు నిర్వహించిన రియల్ వరల్డ్ మైలేజ్ టెస్ట్‌లో Brezza Turbo సిటీలో 10.05kpl, హైవేపై 17.71kpl మైలేజ్ ఇచ్చింది. ఈ రెండు పరీక్షల ఆధారంగా సగటు ఇంధన సామర్థ్యం 13.88kplగా నమోదైంది.

ఇంజిన్ పవర్, టార్క్ వివరాలు

Brezza Turboలో మూడు సిలిండర్ల 1.0-litre టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 110hp పవర్, 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. Maruti Fronx, Toyota Taisorలో ఇదే తరహా ఇంజిన్ అందించే పవర్‌తో పోలిస్తే Brezzaలో 10hp ఎక్కువ శక్తి, 22Nm ఎక్కువ టార్క్ లభిస్తాయి.

Fronx, Taisorలో 5-speed మాన్యువల్ గేర్‌బాక్స్ ఉండగా, Brezzaలో 6-speed యూనిట్‌ను అందించారు. ఈ అదనపు గేర్ ముఖ్యంగా హైవేపై ప్రయాణించేటప్పుడు ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?

సిటీలో 10.05kpl.. హైవేపై 17.71kpl

ఎక్స్‌పర్ట్‌లు నిర్వహించిన రియల్ వరల్డ్ మైలేజ్ పరీక్షలో Brezza Turbo సిటీ ట్రాఫిక్‌ పరిస్థితుల్లో 10.05kpl మైలేజ్ ఇచ్చింది. హైవే ప్రయాణంలో 17.71kpl నమోదు చేసింది. ఈ రెండు ఫలితాలను కలిపి చూస్తే సగటు మైలేజ్ 13.88kplగా ఉంది.

ఈ కారులో ఆటోమేటిక్ ఇంజిన్ స్టాప్‌-స్టార్ట్‌ సిస్టమ్ ఉంది. ట్రాఫిక్‌లో కారు ఆగినప్పుడు ఇంజిన్‌ను ఆటోమేటిక్‌గా ఆపి, అవసరమైనప్పుడు తిరిగి స్టార్ట్ చేసే ఈ వ్యవస్థ ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

అయితే, ఎక్స్‌పర్ట్‌లు ఈ పరీక్ష నిర్వహించిన సమయంలో సిటీలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉంది. దీంతో క్యాబిన్‌ను చల్లగా ఉంచేందుకు AC ఎక్కువగా పని చేయాల్సి వచ్చింది. ఇది సిటీ మైలేజ్‌పై ప్రభావం చూపి ఉండవచ్చని ఎక్స్‌పర్ట్‌లు అభిప్రాయపడ్డారు. వాతావరణం చల్లగా ఉన్న పరిస్థితుల్లో సిటీ మైలేజ్ మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.

హైవేపై ఎక్కువ మైలేజ్ రావడానికి కారణమేంటి?

Brezza Turboలో 6-speed మాన్యువల్ గేర్‌బాక్స్ ఉండటం హైవే మైలేజ్‌కు అనుకూలంగా మారింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో టాప్ గేర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఇంజిన్ సుమారు 2,500rpm వద్ద పని చేస్తుంది. దీనికి విరుద్ధంగా Fronx, Taisorలోని 5-speed గేర్‌బాక్స్‌తో అదే 100kph వేగంతో ప్రయాణిస్తే ఇంజిన్ సుమారు 2,700rpm వద్ద తిరుగుతుంది. తక్కువ rpm వద్ద ప్రయాణించడం వల్ల Brezzaలో ఇంధన సామర్థ్యం మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, Fronx, Taisor కార్లు Brezza కంటే 165kg తక్కువ బరువు కలిగి ఉన్నప్పటికీ, వాటి హైవే మైలేజ్ Brezza Turbo కంటే సుమారు 1kpl తక్కువగా నమోదైంది. అంటే తక్కువ బరువు ఒక్కటే ఎక్కువ మైలేజ్‌కు కారణం కారణం కాదని ఈ పరీక్ష ఫలితాలు సూచిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ఈ-చలాన్లతో ఇబ్బంది పడుతున్నారా? నేషనల్‌ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు.. ఇలా చేయండి

మైలేజ్ టెస్ట్ ఎలా నిర్వహించారు?

రియల్ వరల్డ్ మైలేజ్ పరీక్షకు ముందు కార్ల ఇంధన ట్యాంకులను పూర్తిగా నింపారు. తయారీ సంస్థ సూచించిన మేరకు టైర్ ప్రెషర్‌ను సెట్ చేస్తారు. ఆ తర్వాత Navi Mumbai పరిసరాల్లో నిర్ణయించిన సిటీ & హైవే మార్గాల్లో కార్లను నడుపారు. ఈ పరీక్షల్లో నిర్దిష్ట సగటు వేగాలను పాటించారు. ప్రతి కారులో ఒకరు మాత్రమే ప్రయాణించారు. ACని 22 డిగ్రీల వద్ద Full Auto మోడ్‌లో ఉంచారు. అవసరమైనప్పుడు ఆడియో సిస్టమ్, ఇండికేటర్లు, వైపర్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఇతర ఎలక్ట్రికల్ ఫీచర్లను కూడా సాధారణ వినియోగదారుల తరహాలో ఉపయోగించారు. ఒకే డ్రైవర్‌ వల్ల డ్రైవింగ్ స్టైల్‌లో తేడాల ప్రభావం తగ్గించేందుకు మధ్యమధ్యలో డ్రైవర్లను మార్చారు. ప్రతి పరీక్ష ముగిసిన తర్వాత మళ్లీ ట్యాంక్‌ను పూర్తిగా నింపి, అప్పటికి వినియోగించిన ఇంధనం ఆధారంగా మైలేజ్‌ను లెక్కించారు.

అయితే, ఇదే మైలేజ్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తుందని భావించకూడదు. ట్రాఫిక్, వాతావరణం, డ్రైవింగ్ స్టైల్‌, AC వినియోగం వంటి అంశాలను బట్టి వాస్తవ మైలేజ్ మారుతుంది.

Maruti Brezza Turbo ధర, వేరియంట్లు

Brezza సిరీస్‌ LXi, VXi, ZXi & ZXi+ అనే నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. టర్బో పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.7.5 లక్షల నుంచి రూ.11.26 లక్షలు వరకు ఉన్నాయి, ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.