Police Arrested Several People In Sandhya Theater Stampede Incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theater Stampede) ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద ఈ నెల 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నటుడు అల్లు అర్జున్ సహా, సెక్యూరిటీ మేనేజర్, థియేటర్ యాజమాన్యంపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఆదివారం ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు.

Also Read: Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్