Show Cause Notice To Sandhya Theater: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ (Sandhya Theater) తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) మంగళవారం ఆస్పత్రిలో బాలున్ని పరామర్శించారు. 'బాలునికి చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 4వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్‌కు ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. పూర్తిగా కోలుకునేందుకు టైం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులిటెన్ విడుదల చేస్తారు. ప్రభుత్వ పరంగా బాధిక కుటుంబానికి అండగా ఉంటాం.' అని సీపీ తెలిపారు.

థియేటర్‌కు షోకాజ్ నోటీసులు

మరోవైపు, ఈ కేసుకు సంబంధించి సంధ్య థియేటర్‌కు సీపీ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలన్నారు. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అటు, ఈ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను 2 రోజుల క్రితం అరెస్ట్ చేయగా నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం, హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. ఈ బెయిల్ రద్దు చెయ్యాలని హైదరాబాద్ పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. పై అధికారుల నుంచి అనుమతి రాగానే ఈ పిటిషన్ వేసే అవకాశం ఉందని సమాచారం.

Also Read: President Droupadi Murmu: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - ఈ నెల 21 వరకూ భాగ్యనగరంలోనే..