Sanatana Dharma Protection: సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి పరిరక్షణ మనందరి బాధ్యత - బీజేపీ టెంపుల్ సెల్ సమావేశంలో కీలక నిర్ణయాలు
2 months ago 3
ARTICLE AD
Indian Culture Protection BJP:   దేశ నిర్మాణం అనేది కేవలం ప్రభుత్వాలకు మాత్రమే పరిమితమైన బాధ్యత కాదని, ప్రజలందరి సమిష్టి కృషితోనే బలమైన, సంస్కారవంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని బీజేపీ జాతీయ పార్టీ విభాగాల సహ సమన్వయకర్త యస్. విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఢిల్లీ బీజేపీ ఆలయ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ బీజేపీలో తన తొలి పర్యటన సందర్భంగా పూజ్య సంత్ మహాత్ములు, గురువుల ఆశీస్సులు పొందడం తనకు ఎంతో ప్రత్యేకమైన, మరపురాని అనుభవమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మన సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు , ఆధ్యాత్మిక విలువలను కాపాడుకుంటూ, వాటిని భావితరాలకు సన్మార్గంలో అందించడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. ధర్మం అంటే కేవలం పూజలు, ఆచారాలు, నిత్య నియమాలకు మాత్రమే పరిమితం కాదని స్పష్టం చేశారు. సమాజంలో ఆపదలో ఉన్నవారికి సేవ చేయడం, ప్రేమ, ఐక్యత, సోదరభావం, సద్భావనలను పెంపొందించడం కూడా ధర్మంలో అంతర్భాగమేనని అభిప్రాయపడ్డారు. మన మహర్షులు, గురువులు తరతరాలుగా సత్యం, సేవ, సంస్కార మార్గంలో నడవాలని బోధించారని గుర్తుచేశారు.
దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాల్సిన అవసరం ఉందని, సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. పూజ్య సంత్ మహాత్ముల దివ్య ఆశీస్సులతో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనా విధానం మరియు స్ఫూర్తితో ధర్మాన్ని కాపాడుకుంటూ భారతీయ సంస్కృతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. జాతీయ ప్రయోజనాల సాధనలో ఆధ్యాత్మిక శక్తులు, పార్టీ కార్యకర్తలు చేతులు కలపాలని పిలుపునిచ్చారు.
డిల్లీ,
ఒక మరపురాని చక్కని కార్యక్రమం, మంచి అనుభవం!
ఈ రోజు బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ నందు నా మెదటి పర్యటన బీజేపీ ఆలయ విభాగం కార్యకర్తల సమావేశంలో పాల్గొని, పూజ్యులైన సంత్ మహాత్ములు, గురువులు మరియు సోదర సోదరీమణుల ఆశీర్వాదం తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను.
కార్యక్రమంలో… pic.twitter.com/HsYQw3Eob5
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) August 30, 2026
సనాతన ధర్మ పరిరక్షణ మరియు సామాజిక ఐక్యత లక్ష్యంగా సాగిన ఈ సమావేశం, ఢిల్లీ బీజేపీ ఆలయ విభాగం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ధర్మ పరిరక్షణతో పాటు దేశ సేవే పరమావధిగా ప్రచార కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచిస్తూ సమావేశం ముగిసింది.
Read Entire Article