Jagan idea of Mavigun: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ పై వస్తున్న విపరీతమైన ట్రోల్స్, విమర్శలపై పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం మీడియా సమావేశంలో స్పందించారు. జగన్ మోహన్ రెడ్డిని ఒక తిరుగులేని లీడర్ గా అభివర్ణించారు. జగన్ ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తే తీసుకునే వ్యక్తి కాదు.. ఆయన ఆలోచనలు స్వతంత్రంగా ఉంటాయి అని పేర్కొన్నారు. మావిగన్ వెనుక ఉన్న ప్రతిపాదన కానీ జగన్ సొంత మేధస్సు నుంచి వచ్చిందే తప్ప, తనలాంటి సలహాదారులు ఇచ్చింది కాదని సజ్జల క్లారిటీ ఇచ్చారు.

మావిగన్ అనేది ఒక అద్భుతమైన గ్రోత్ కారిడార్ అని, తక్కువ ఖర్చుతో రాష్ట్రానికి ఒక వాస్తవిక రాజధానిని నిర్మించవచ్చనేది జగన్ దార్శనికత అని పేర్కొన్నారు. ఈ సలహా ఎవరో ఇచ్చారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఒక బలమైన నాయకుడు. ఆయనకు ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తే తీసుకుంటారా ఆయన ఆలోచనలు ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సాగుతాయి అని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదన వెనుక ఉన్న వ్యూహం, లక్ష్యం పూర్తిగా జగన్ దేనని ఆయన తేల్చి చెప్పారు.

గతంలో తాము ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంపై స్పందిస్తూ.. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనేది తమ సంకల్పమని, కానీ కేవలం రాజకీయ కారణాల వల్ల దానిని అడ్డుకున్నారని సజ్జల ఆరోపించారు. నఅసెంబ్లీ ఒక దగ్గర, ఎగ్జిక్యూటివ్ ఒక దగ్గర, జ్యూడిషియల్ ఒక దగ్గర అని మేము స్పష్టంగా చెప్పాం. కానీ విపక్షాలు దానినినమూడు ముక్కలాట అంటూ ఎగతాళి చేయడం సరికాదు అని విమర్శించారు. అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయాలు తీసుకున్నామని ఆయన సమర్థించుకున్నారు.

ఇంతటి క్రూరమైన మనస్తత్వం ఎవరికీ ఉండకూడదు ముఖ్యంగా రాజకీయ పార్టీకి అసలు ఉండకూడదు.

రాష్ట్ర రాజధాని సంబంధించి రాష్ట్ర ప్రజలు అందరూ సంబరాలు చేసుకుంటారు. వీరు మాత్రం ఇంకా అవే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే క్రూరమైన ఆలోచనే.

ఆంధ్రప్రదేశ్ పై వైసీపీకి ఎందుకు అంత పగ! pic.twitter.com/0PH2NUO28g

— JanaSena Shatagni (@JSPShatagniTeam) April 4, 2026

మావిగన్ అనే పేరుపై వస్తున్న సెటైర్లపై స్పందిస్తూ.. పేరులో ఏముంది, అందులోని అర్థాన్ని గ్రహించాలని సూచించారు. మార్కెట్‌లో బీడా, బేడా అని రకరకాల పేర్లు ఉన్నప్పుడు లేని అభ్యంతరం, అభివృద్ధి కోసం పెట్టిన మావిగన్ అనే పేరుపై ఎందుకు అని ప్రశ్నించారు. అమరావతి పేరుతో లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం కంటే, ఉన్న మౌలిక సదుపాయాలను వాడుకుంటూ అభివృద్ధి చెందడమే సరైన మార్గమని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.