Sai Sudharsan Scripts History Surpasses Chris Gayle: ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) ఓపెనర్ సాయి సుదర్శన్ శుక్రవారం రాత్రి సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తో జరిగిన పోరులో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సెంచరీతో విరుచుకుపడటమే కాకుండా, ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ సీజన్ ఆరంభంలో ఆరు మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీతో తడబడిన సుదర్శన్, చిన్నస్వామి స్టేడియంలో మాత్రం క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 58 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో 2000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న బ్యాటర్‌గా నిలిచాడు.

క్రిస్ గేల్ రికార్డు బద్ధలు..
గతంలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 48 ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు పూర్తి చేసి అగ్రస్థానంలో ఉండేవాడు. ఇప్పుడు సాయి సుదర్శన్ కేవలం 47 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి గేల్ ను వెనక్కి నెట్టేశాడు.

Also Read: IPL క్రేజ్.. సజ్జనార్ మార్క్ హెచ్చరిక.. యమధర్మరాజు దగ్గర DRS ఉండదు!

ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 2000 రన్స్ చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది:

సాయి సుదర్శన్ కేవ‌లం 47 ఇన్నింగ్స్‌లలో ఈ ఘ‌న‌త సాధించ‌గా, క్రిస్ గేల్ మాత్రం 48 ఇన్నింగ్స్‌లలో ఈ మార్కును చేరుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన‌ షాన్ మార్ష్ , 52 ఇన్నింగ్స్‌లతో, చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్ర‌జెంట్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ - 57 ఇన్నింగ్స్‌ల‌తో, కేఎల్ రాహుల్ - 60 ఇన్నింగ్స్‌లతో త‌ర్వాతి స్థానాల్లో నిలిచారు. అలాగే బంతుల పరంగా చూస్తే, ఐపీఎల్ లో వేగంగా 2000 పరుగులు చేసిన ఆరవ భారతీయ బ్యాటర్‌గా సుదర్శన్ నిలిచాడు. ఈ జాబితాలో అభిషేక్ శర్మ (1193 బంతులు) మొదటి స్థానంలో ఉండగా, సెహ్వాగ్, పంత్, జైస్వాల్, యూసుఫ్ పఠాన్ తర్వాత సుదర్శన్ (1361 బంతులు) నిలిచాడు.

చివ‌రి హోమ్ గేమ్..
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు జట్టుకు ఈ సీజన్‌లో ఇది చివరి హోమ్ గేమ్ కావడం విశేషం. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 99 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగింది. గుజరాత్ తరపున జేసన్ హోల్డర్ ఈ మ్యాచ్ తో ఈ సీజ‌న్ లో అరంగేట్రం చేశాడు. టాస్ సమయంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. ఫిల్ సాల్ట్ గాయపడటంతో అత‌ని స్థానంలో జాకబ్ బెథెల్ తుది జట్టులోకి వచ్చాడని, వికెట్ కండిషన్స్ ను బట్టి తాము ప్లాన్ చేసుకుంటున్నామని పేర్కొన్నాడు. ఇక్కడి వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తున్నా, గ్రాస్ లేకపోవడం వల్ల మొదటి ఇన్నింగ్స్‌లో కొంచెం స్లోగా ఉండే ఛాన్స్ ఉంది" అని చెప్పాడు.

Also Read: యార్కర్ కింగ్ బుమ్రా లగ్జరీ కార్ల గ్యారేజీ.. నిస్సాన్ జీటీ-ఆర్ నుంచి మేబ్యాచ్ వరకు.. అదిరిపోయే కలెక్షన్!

గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందిస్తూ..ముంబైతో జరిగిన మ్యాచ్ వంటివి టోర్నమెంట్ లో అప్పుడప్పుడు జరుగుతుంటాయని, వాటిని వదిలేసి సానుకూల అంశాలపై దృష్టి పెడుతున్నామని పేర్కొన్నాడు. జట్టులోకి జేసన్ హోల్డర్ వచ్చాడని, మానవ్ సుతార్ కూడా టీమ్ లోకి చేరాడని తెలిపాడు. మ‌రోవైపు సుదర్శన్ సెంచరీతో గుజరాత్ భారీ స్కోరు సాధించడంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది.