Sunrisers Eastenr Cape Heart Break: ముచ్చటగా మూడోసారి ఎస్ఏ20 టైటిల్ గెలవాలని భావించిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఆశలపై ఎంఐ (ముంబై ఇండియన్స్) కేప్ టౌన్ నీళ్లు చల్లింది. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఫైనల్లో సన్ రైజర్స్ పై 76 పరుగులతో ఘన విజయం సాధించిన ఎంఐ తొలి సారి టోర్నీ విజేతగా నిలిచింది. 2023, 24 రెండు ఎడిషన్లలో సన్ రైజర్స్ విజేతగా నిలవగా, మూడోసారి జరిగిన ఎడిషన్ లో రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతకుముందు జోష్ మధ్య జరిగిన ఫైనల్లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న ఎంఐ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 181 పరుగుల భారీ స్కోరు చేసింది. జట్టులో తలో ఒకరు క్యామియో ఆడటంతో మంచి స్కోరు సాధించింది. కానర్ ఈస్టర్ హుజైన్ (26 బంతుల్లో 39, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. డేవాల్డ్ బ్రివిస్ (18 బంతుల్లో 38, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగాడు. బౌలర్లలో మార్కో యాన్సెస్, రిచర్డ్ గ్లెస్సన్, లియామ్ డాసన్ లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ లో సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో 105 పరుగులకు కుప్పకూలింది. టామ్ ఆబెల్ (25 బంతుల్లో 30, 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టార్ పేసర్ కగిసో రబాడ (4/25) ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. ట్రెంబ్ టౌల్ట్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నీలో 204 పరుగులు, 19 వికెట్లు తీసిన యాన్సెన్ కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు దక్కింది. ఈ టైటిల్ విజయంతో తను అడుగుపెట్టిన ప్రతి లీగ్ లోనూ టైటిల్ సాధించిన జట్టుగా ఎంఐ ఘనత వహించింది. ఇప్పటివరకు ఐపీఎల్, చాంపియన్స్ లీగ్ 20 (ఇప్పుడు మనుగడలో లేదు), డబ్ల్యూపీఎల్, మేజర్ క్రికెట్ లీగ్, ఐఎల్ టీ20, ఎస్ఏటీ20 టోర్నీల టైటిల్స్ ను సాధించింది.

Cape Town.. 𝐏𝐔𝐋𝐋 𝐈𝐍, 𝐈𝐓𝐒 𝐏𝐀𝐑𝐓𝐘 𝐓𝐈𝐌𝐄 🕺🔥

MI Cape Town are your 2️⃣0️⃣2️⃣5️⃣ #BetwaySA20 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 💙✨🏆#MICapeTown #OneFamily #MICTvSEC #BetwaySA20Final pic.twitter.com/eU9v1V7jKa

— MI Cape Town (@MICapeTown) February 8, 2025

రికెల్టన్ దూకుడు..
సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ (15 బంతుల్లో 33, 1 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడైన ఇన్నింగ్స్ తో ఆరంభంలోనే సన్ రైజర్స్ ను హడలెత్తించాడు. బౌలర్లను ఊచకోత కోస్తూ కళ్లు చెదిరే నాలుగు సిక్సర్లను బాదాడు. దీంతో ఓపెనింగ్ వికెట్ కు 51 పరుగుల భాగస్వామ్యం జతైంది. మరో ఓపెనర్ వాన్ డర్ డస్సెన్ (23) యాంకర్ ఇన్నింగ్స్ తో అతనికి సహకారం అందించాడు. వీళ్లిద్దరూ వెనుదిరిగిన తర్వాత కానర్, మిగతా మిడిలార్డర్ బ్యాటర్లతో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ముఖ్యంగా బౌండరీలతోపాటు సిక్సర్లును బాదుతూ హెల్దీ రన్ రేట్ ను మెయింటేన్ చేశాడు. చివర్లో త్వరగా వికెట్లు కోల్పోయినా, గెలుపు సాధించేందుకు అవసరమైన స్కోరును ఎంఐ సాధించింది. బౌలర్లలో ఓవర్టన్, ఐడెన్ మార్క్రమ్ చెరో వికెట్ తీశారు.

కట్టడి చేసిన బోల్ట్..
పైనల్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ (4-0-9-2) చేయడంతో కీలకమైన హార్మన్ (1), ట్రిస్టన్ స్టబ్స్ (15) వికెట్లు తీసిన బోల్ట్ సన్ రైజర్స్ ను కట్డి చేశాడు. అతనికితోడు రబాడ కూడా రెచ్చిపోవడంతో సన్ రైజర్స్ ఏ దశలోనూ టార్గెట్ వైపు నడవలేదు. చాలా నెమ్మదిగా ఆడుతూ పవర్ ప్లేలో బంతికొక పరుగు చొప్పును కూడా సాధించ లేకపోయింది. కేవలం 34/2తో నిలవడంతో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగి పోయి, వికెట్లు పారేసుకున్నారు. మధ్యలో అబెల్. టోనీ డీ జోర్జి (26) తో కలిసి మూడో వికెట్ కు 56 పరగులు జోడించినా, వీరిద్దరూ ఔటైన తర్వాత మిగతా బ్యాటర్లు ఇలా వచ్చి, అలా వెళ్లడంతో ఓటమి అంచున నిలిచింది. గత రెండు సీజన్లలో విజేతగా నిలిచిన సన్ రైజర్స్ ఆ స్థాయి సత్తా చాటలేక పోయింది. నిజానికి టోర్నీలో మొదటి నుంచి వెనుకంజలో నిలిచిన సన్ రైజర్స్ కీలకదశలో పుంజుకుని నాకౌట్ కు అర్హత సాధించింది. ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2లో గెలిచిన సన్ రైజర్స్ ఆ స్థాయి పోరాట పటిమ ఫైనల్లో ప్రదర్శించ లేకపోయింది. ఎంఐ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కు తలవంచి, పరాజయం పాలైంది. మిగతా బౌలర్లలో జార్జ్ లిండేకు రెండు వికెట్లు దక్కగా, కార్బిన్ బోష్, కెప్టెన్ రషీద్ ఖాన్ చెరో వికెట్ తో రాణించారు.

Also Read: ICC Champions Trophy: 39 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ నిర్వహిస్తున్న పాక్ కు ఎదురుదెబ్బ.. టోర్నీకి సన్నాహకంగా ఏర్పాటు చేసిన..