శర్వానంద్ 'ఒకే ఒక జీవితం'తో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ పొందిన దర్శకుడు శ్రీ కార్తీక్. ఇవాళ తన కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఇందులో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) మెయిన్ లీడ్. మరి హీరో ఎవరు? అంటే... ఈ సినిమా వరకు హీరో, హీరోయిన్ రుక్మిణియే అని చెప్పాలి. ఎందుకంటే... ఇదొక రోడ్ ట్రిప్ మూవీ.

ఫైండింగ్ తార... గ్లింప్స్ చూశారా?
రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న రోడ్ ట్రిప్ కామెడీ సినిమాను ఈ రోజు అనౌన్స్ చేశారు. 'ఫైండింగ్ తార' (Finding Thara) పేరుతో ఓ కాన్సెప్ట్ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. అందులో సినిమా కాన్సెప్ట్‌ పరిచయం చేశారు. ఎంత వినోదాత్మకంగా ఉండబోతుందో చెప్పారు.

Also Read: Samanta Dhulipala In Red Saree - చీరలో నాగచైతన్య మరదలు సమంత... ధూళిపాళ లేడీ లేటెస్ట్ ఫోటోలు

వీడియో గ్లింప్స్ ప్రారంభంలో దర్శకుడు శ్రీ కార్తీక్, యాక్టర్లు దేవ్ రామ్‌నాథ్, వినయ్‌ కనిపించారు. వాళ్ళకు నిర్మాతల నుంచి 'తార' గురించి ఫోన్ వస్తుంది. ఆమె ఎక్కడ అని అడుగుతారు. వాళ్ళతో పాటు నిక్కి (Nikki) అని కెమెరా కూడా ఉంటుంది. అది వాళ్ళ ప్రయాణంలో ఓ భాగం అవుతారు. ఆ తర్వాత ఓ స్టూడియోకు వెళతారు. ఓ మనిషి 'మేడమ్... వాళ్ళు వచ్చార'ని చెబుతాడు. ఆ తర్వాత తార పాత్రలో రుక్మిణి వసంత్‌ను పరిచయం చేశారు. దర్శకుడు శ్రీ కార్తీక్ చెప్పిన కథ రుక్మిణిని ఎంతో ఆకట్టుకుంటుంది. వెంటనే సినిమాలో నటించడానికి ఆమె 'ఎస్' చెబుతారు. ఇక చివరగా రుక్మిణితో పాటు మిగతా బృందాన్ని ఫోటో తీయడంతో గ్లింప్స్ ఎండ్ అయ్యింది.

Also Read: 418 Movie Review In Telugu - 418 రివ్యూ: చైత్ర సినిమా భయపెట్టిందా? ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఉందంటే?

View this post on Instagram

A post shared by Madboys Entertainment (@madboys_entertainment)

రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రలో శ్రీ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ రోడ్ ట్రిప్‌ సినిమాను జాతీయ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ 'చిలసౌ' నిర్మించిన సిరుని సినీ కార్పొరేషన్, మాడ్‌ బాయ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జస్వంత్, దేవ్ రామ్‌నాథ్, శ్రీ కార్తీక్ నిర్మాతలు. సాయికృష్ణ గద్వాల్ సహ నిర్మాత. ఇదొక న్యూ ఏజ్ రోడ్ ట్రిప్ కామెడీ సినిమా అని దర్శక నిర్మాతలు తెలిపారు. టైటిల్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Also Read: Haiku Review In Telugu - హైకూ రివ్యూ: లేడీస్ కాలేజీలో కుర్రాడొక్కడే... శ్రీదేవి తమిళ్ సినిమా ఎలా ఉందంటే?