Brahmamudi Serial Today Episode: రేఖ బలవంతంగా ఇందుకు పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తుందని అక్క మాత్రం నీ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుందని.. రేఖ నిర్ణయానికి ఎవ్వరూ ఎదురు చెప్పడం లేదని నందు వెళ్లి రాజుకు చెప్తుంది. ఈ నిజాలన్ని చెప్పి నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని తాను రాలేదని కానీ నీకు నిజం తెలిశాక ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటావని అనుకుంటున్నాను అంటూ నందు వెళ్లిపోతుంది.

నందును మరోసారి ఇంటికి రావొద్దన్న చలపతి

నందు వెనకాలే వెళ్లిన చలపతి.. వెంకీ విషయంలో నిన్ను ఇంట్లోకి రావద్దన్నాను కానీ ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను ఎప్పుడైనా నువ్వు వెంకీ కోసం రావొచ్చు కానీ రాజు, నందుల గురించి ఇక్కడ మాట్లాడొద్దు.. ఆ విషయం అయితే మా ఇంటికే రావొద్దని చెప్తాడు. దుగ్గిరాల ఇళ్లు అంటేనే తనకు నచ్చదని చెప్తాడు చలపతి. నందు బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఇందు పెళ్లికి ముహూర్తం పెట్టించిన రేఖ

<a title=" ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

రేఖ చెప్పిన పెళ్లి వాళ్లు ఇందును చూసుకోవడానికి వస్తారు. పెళ్లికొడుకు ఇందును చూసి వంకరలు తిరిగిపోతుంటాడు. వీడేంటి ఇలా ఉన్నాడు అని అపర్ణ తిట్టుకుంటుంది. రేఖ మాత్రం ఆ ఇందుకు వీడే కరెక్ట్‌ అని మనసులో అనుకుంటుంది. నందు వచ్చి ఏం చేస్తుంటావు అని అడిగితే సోషనల్ మీడియాలో నేనో పెద్ద స్టార్‌ను నేను రీల్‌ పెడితే నిమిషంలో ట్రెండ్ అవుతుంది అంటూ ఏదేదో సొల్లు వాగుతుంటాడు. నందు కోపంగా అక్కా చీ వీడినా నువ్వు పెళ్లి చేసుకునేది అంటుంది. నందు కోపంగా నాకు ఈ పెళ్లి నచ్చలేదు.. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది. అందుకు రేఖ కోపంగా తిడుతూ నీకు కూడా ఇలాగే పెళ్లి చేస్తాను అంటూ బెదిరిస్తుంది. ఎవరు అపాలన్నా ఈ పెళ్లి ఆగదు.. అంటూ పంతులును పిలిపించి ముహూర్తం పెట్టిస్తుంది రేఖ. ఆరు నెలల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పిన పంతులుకు గంటో రెండు గంటల్లో ముహూర్తం పెట్టండి అంటూ భ్రమరాంబ బెదిరిస్తుంది. గంటో రెండు గంటలు అంటే కష్టం అమ్మా అంటూ రేపు ఉదయం పది గంటలకు ముహూర్తం ఉంది అని చెప్తాడు. అదే ముహూర్తానికి పెళ్లి ఫిక్స్‌ చేస్తారు.

లక్ష్మీతో ఎమోషనల్‌ అయిన వెంకీ

కిచెన్‌లో ఉన్న లక్ష్మీ దగ్గరకు వెంకీ వెళ్లి బాధపడతాడు. మీకోసం నేను నందును త్యాగం చేశాను. ఇప్పుడు అన్నయ్యను కూడా అలా చేయమనడం కరెక్ట్‌ కాదమ్మ.. అన్నయ్య చాలా బాధపడుతున్నాడు. నువ్వు వెళ్లి నాన్నను ఒప్పించు అంటాడు. ఇప్పటికే ఒకడితో వేగలేకపోతున్నాను.. ఇప్పుడు వాడు.. మీ నాన్నేమో అసలు మాట వినడం లేదు అంటుంది. అందుకు వెంకీ బాధపడుతూ ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు.. ఆ విషయం నాన్నకు ఎప్పుడు అర్తం అవుతుందో ఏంటో అనుకుంటూ వెళ్లిపోతాడు.

ఇందుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?

ఇందు ఆఫీసుకు వెళ్తుంటే.. భ్రమరాంబ వచ్చి ఆపేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. ఆఫీసుకు వెళ్తున్నానని ఇందు చెబితే.. భ్రమరాంబ కంగారు పడుతూ రేఖను పిలుస్తుంది. ఇందు ఆఫీసుకు వెళ్తుందట.. అటు నుంచి అటే రాజు గాడి దగ్గరకు వెళ్తుందేమో రేఖ అంటూ చెప్పగానే.. రేఖ వచ్చి ఇందు అలా ఏం చేయదు వదిన.. ఎందుకంటే ఇందు అటు నుంచి అటే రాజు దగ్గరకు వెళితే.. ఇక్కడ ఇంట్లో వాళ్ల ముసలి తాత, నాన్నమ్మ ఉన్నారు కదా వాళ్ల కోసం అయినా ఇందు ఇంటికి సేఫ్‌గా వస్తుంది.. ఏమంటావు ఇందు.. కరెక్టే కదా.. నువ్వు వెళ్లు ఇందు అంటూ పంపిస్తుంది రేఖ.

ఆఫీసులో స్టాప్‌కు వార్నింగ్‌ ఇచ్చిన ఇందు

ఆఫీసుకు వెళ్లిన ఇందు గురించి ఒక్కోక్కరు ఒక్కో విధంగా మాట్లాడుకుంటారు. అంతా విన్న ఇందు కోపంగా అందరికీ వార్నింగ్‌ ఇస్తుంది. ఇంకొక్క మాట ఎవరైనా మాట్లాడితే వాళ్లన జాబ్‌లోంచి తీసేస్తానని బెదిరిస్తుంది. అప్పుడే వచ్చిన ప్రశాంత్‌.. ఇందును కూల్‌ చేస్తూ.. అందరినీ పని చేసుకోమని చెప్పి ఇందును చాంబర్‌లోకి తీసుకెళ్తాడు. రాజు ఆఫీసుకు వచ్చే ప్లాన్‌ చెప్తాడు. ఇందు మాత్రం ఈ ప్రశాంత్‌ ఇవాళ రాజు చేతిలో అయిపోతాడు అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త