న్యూ చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన ఘటన దుమారం రేపుతోంది. కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్ చేస్తున్న వీడియోలు వైరల్ కావడంతో అతడికి చిక్కులు తప్పవని తెలుస్తోంది. రెండో ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో బ్రాడ్‌కాస్ట్ కెమెరా పరాగ్‌ను చూపిస్తున్నప్పుడు అతడు ఈ సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఈ ఫుటేజీ త్వరగా వైరల్ కావడంతో చాలా మంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బ్యాటింగ్‌లో ఛేజింగ్‌లో కీలక సమయంలో రాజస్థాన్ కెప్టెన్ పరాగ్ 16 బంతుల్లో 29 పరుగులు చేసి అవుటైన వెంటనే ఈ సీన్ కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. రియాన్ పరాగ్ మీద క్రమశిక్షణా చర్యలకు దారితీస్తుందా అనే ప్రశ్నలను లేవనెత్తింది. వేపింగ్‌కు వ్యతిరేకంగా స్పష్టమైన బహిరంగ నియమావళి లేనప్పటికీ, స్టేడియంలలో ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) కఠినమైన మార్గదర్శకాలు ఉంటాయి. డ్రెస్సింగ్ రూమ్‌లు లేదా డగౌట్‌లలో పొగాకు లేదా దానికి సంబంధించిన ఉత్పత్తులను వినియోగించడం ఆరోగ్య, భద్రతా ప్రోటోకాల్‌ల ప్రకారం సాధారణంగా నిషేధించారు. దీనివల్ల రియాన్ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు తీసుకోవడం ఖాయమనిపిస్తోంది.

Wait… did I just catch Riyan Parag vaping during live Indian Premier League broadcast? 👀
This is wild if true…#IPL #RiyanParag #RR @rajasthanroyals pic.twitter.com/GInVcwfNmj

— JonKing980 (@JonKing980) April 28, 2026

సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లిన తర్వాత ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు రియాన్ పరాగ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ 24 ఏళ్ల ప్లేయర్ డ్రెస్సింగ్ రూంలో చేసిన పని కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ మ్యాచ్‌కు ముందు ఏడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 81 పరుగులు మాత్రమే చేసిన పరాగ్ అటు బిహేవియర్ విషయంలోనూ తప్పిదాలు చేయడం సరికాదని మాజీలు సూచిస్తున్నారు.

His 15-year-old teammate is more mature.. #riyanparag is captain of a #IPL franchise and doesn't know or cares about the rules. pic.twitter.com/JXTnglwgAV

— Jatin Sharma (@jatincricket) April 28, 2026

రాజస్థాన్ రాయల్స్ 222 పరుగుల లక్ష్యాన్ని మరో 6 వికెట్లు ఉండగానే విజయవంతంగా ఛేదించింది. పంజాబ్ కింగ్స్‌కు ఈ సీజన్‌లో మొదటి ఓటమిని రుచి చూపించిన జట్టుగా రాజస్తాన్ నిలిచింది. ఏప్రిల్ 10న గువహటిలోని ACA స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా, డగౌట్ లోపల మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు రాజస్థాన్ రాయల్స్ (RR) టీమ్ మేనేజర్ రోమీ భిందర్‌కు రూ. 1 లక్ష జరిమానా, అధికారిక హెచ్చరిక జారీ చేశారు. మ్యాచ్ సమయంలో డివైజ్ ఉపయోగించినందుకు గాను BCCI అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ACSU) భిందర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.