Hebah Patel's Repu Udayam 10 Gantalaku OTT Streaming : మరో సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సడన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. థియేటర్లలోకి వచ్చిన రెండు వారాల్లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన మూవీ... 'రేపు ఉదయం 10 గంటలకు...'. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాంలో అందుబాటులో ఉంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఈ మూవీ సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. హెబ్బా పటేల్, చైతన్య రావు జంటగా నటించిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌కు... ఓ పిట్ట కథ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాలకు దర్శకత్వం వహించిన చందు ముద్దు ఈ మూవీని తెరకెక్కించారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. 2 వారాల్లోపే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.

సినిమాలో హెబ్బా పటేల్, చైతన్యరావులతో పాటు అభినవ్ గోమటం, కిరీటి దామరాజు, సాహితీ అవంచ, మోహిత్, వాసు ఇంటూరి తదితరులు కీలకపాత్రలు పోషించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామ్ వీరపనేని నిర్మించారు.

Also Read : మన పెద్ది పహిల్వాన్ వచ్చేశాడు - గ్లోబల్ స్టార్ బర్త్ డే ట్రీట్ అదిరిపోయిందిగా...