Powerful Breathing Techniques For Stress Relief : రోజువారీ జీవితంలో ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ చాలా సాధారణమైపోయాయి. పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, నిద్రలేమి వంటి కారణాల వల్ల చాలామంది డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉండడం కష్టమవుతోంది. నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ అవుతాయి. అలాంటి సమయంలో కొన్ని సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అవేంటో వాటి వల్ల కలిగే లాభాలు.. ఎలా చేస్తే మంచిదో చూసేద్దాం.

మీరు యాంగ్జైటీ, ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా? అయితే కేవలం కొన్ని నిమిషాల్లోనే రిలాక్స్‌గా ఫీల్ అయ్యే బ్రీతింగ్ వ్యాయామాలు ఇక్కడ ఉన్నాయి. శ్వాసను సరైన విధంగా నియంత్రించడం వల్ల మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ చేరి ఒత్తిడి తగ్గడంలో సహాయపడుతుంది. వెంటనే రిలాక్స్ చేసే 5 ఈజీ బ్రెతింగ్ ఎక్సర్‌సైజెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డీప్ బ్రీతింగ్

డీప్ బ్రీతింగ్ అనేది చాలా సులభమైన విషయం కానీ.. చాలా ప్రభావవంతమైన శ్వాస వ్యాయామం. ముందుగా సౌకర్యంగా కూర్చొని ముక్కు ద్వారా నెమ్మదిగా లోపలికి గాలి పీల్చాలి. ఆ తర్వాత కొన్ని సెకన్లు ఆపి నోటి ద్వారా మెల్లగా బయటకు వదలాలి. ఇలా 5 నుంచి 10 సార్లు చేస్తే గుండె వేగం క్రమంగా తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది.

బాక్స్ బ్రీతింగ్

ఈ టెక్నిక్‌ను చాలా మంది మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఉపయోగిస్తారు. నాలుగు సెకన్లు శ్వాస లోపలికి పీల్చాలి. తర్వాత నాలుగు సెకన్లు ఆపాలి. మళ్లీ నాలుగు సెకన్లు శ్వాస బయటకు వదలాలి. మళ్లీ నాలుగు సెకన్లు ఆపాలి. ఈ సైకిల్‌ను కొన్ని నిమిషాలు కొనసాగిస్తే టెన్షన్ తగ్గి ఫోకస్ పెరుగుతుంది.

ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్

యోగాలో చాలా ప్రసిద్ధి చెందిన ఈ శ్వాస విధానం మనసుకు బ్యాలెన్స్ ఇవ్వడంలో సహాయపడుతుంది. ఒక ముక్కు రంధ్రాన్ని మూసి మరో వైపు నుంచి గాలి పీల్చాలి. తర్వాత వైపు మార్చి బయటకు వదలాలి. ఇలా కొన్ని నిమిషాలు చేస్తే ఆందోళన తగ్గి రిలాక్స్‌గా అనిపిస్తుంది.

4-7-8 బ్రీతింగ్ టెక్నిక్

ఈ టెక్నిక్ నిద్రలేమి, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. ముందుగా నాలుగు సెకన్లు గాలి పీల్చాలి. తర్వాత ఏడు సెకన్లు శ్వాసను ఆపాలి. ఆ తర్వాత ఎనిమిది సెకన్లు మెల్లగా గాలి బయటకు వదలాలి. ఈ పద్ధతిని రోజూ కొన్ని సార్లు ప్రాక్టీస్ చేస్తే మైండ్ ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.

బెల్లీ బ్రీతింగ్

ఈ వ్యాయామంలో ఛాతీ కాకుండా పొట్ట భాగం కదలేలా శ్వాస తీసుకోవాలి. ఒక చేయిని ఛాతీపై మరో చేయిని పొట్టపై పెట్టుకుని నెమ్మదిగా లోపలికి గాలి పీల్చాలి. ఇలా చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గి శ్వాస నియంత్రణ మెరుగుపడుతుంది.

ఈ బ్రీతింగ్ వ్యాయామాలు చేయడానికి ప్రత్యేక పరికరాలు ఏమి అవసరం లేదు. రోజుకు కేవలం 5 నుంచి 10 నిమిషాలు కేటాయించినా సరిపోతుంది. రెగ్యులర్‌గా ఈ పద్ధతులను పాటిస్తే ఒత్తిడి తగ్గడమే కాకుండా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కూడా మెరుగుపడతాయి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.