RCB టీమ్‌ని కొనేసిన హోంబ‌లే

2 weeks ago 2
ARTICLE AD

ఇటీవ‌లి కాలంలో సినీరంగంలో హోంబ‌లే ఫిలింస్ హ‌వా గురించి తెలిసిందే. ఈ సంస్థ వ‌రుస విజ‌యాల‌తో జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తోంది. స‌లార్, కాంతార 2 త‌ర్వాత యానిమేటెడ్ మూవీ మ‌హావ‌తార్-1 తోను ఘ‌న‌విజ‌యం అందుకుంది. కాంతార 2 దాదాపు 800కోట్లు వ‌సూలు చేయ‌గా, మ‌హావ‌తార్ చిత్రం దాదాపు 326  కోట్ల గ్రాస్ (251కోట్ల నెట్) వ‌సూలు చేయ‌డం మ‌రో రికార్డ్.

సినీరంగంలో అసాధార‌ణ విజ‌యాలు సాధిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు క్రీడారంగంపైనా కన్నేసింద‌ని తెలుస్తోంది. తాజా స‌మాచారం మేర‌కు.. హోంబ‌లే సంస్థ ఐపిఎల్ లో పెట్టుబ‌డులు పెట్ట‌నుంది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్.సి.బి) టీమ్ కి స‌హ‌భాగ‌స్వామిగా బ‌రిలో దిగుతోంద‌ని తెలిసింది. ఆర్సీబీ ఇప్పుడు యాజ‌మాన్యాన్ని రెన్యూవ‌ల్ చేయడానికి సిద్ధ‌మ‌వ్వ‌డంతో హోంబ‌లే సంస్థ రేసులోకి చేరింద‌ని తెలిసింది. అలాగే హోంబ‌లే అధినేత కిరంగ‌దూర్ ఎంట‌ర్ టైన్ మెంట్ రంగంతో పాటు క్రీడా రంగంపైనా ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు. 

క్రీడారంగంలో త‌న పోర్ట్ ఫోలియోను విస్త‌రించ‌డం ద్వారా త‌మ హోదాను పెంచుకోవాల‌నుకుంటున్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం కాంతార 2 అసాధార‌ణ విజ‌యాన్ని ఆస్వాధిస్తున్న కిరంగ‌దూర్ మ‌హావ‌తార్ ఫ్రాంఛైజీలో త‌దుప‌రి చిత్రాల‌ను తెర‌కెక్కించే ప‌నిలో బిజీగా ఉన్నారు. మ‌రోవైపు ప్ర‌భాస్- ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో స‌లార్ 2 కోసం స్క్రిప్టు ప‌నులు సాగుతున్న‌ట్టు తెలిసింది.  

Read Entire Article