బెంగళూరు: ఐపీఎల్ 2026 మార్చి 28న ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచుల నిర్వహణకు ఆటంకాలు ఇదివరకే తొలగడంతో ఆర్సీబీతో పాటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ హ్యాపీగా ఉంది. తమ అభిమానులు ముందు ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అని ఆర్సీబీ ఎక్స్ ఖాతాలో పేర్కొంది. RCB vs SRH మ్యాచ్ టికెట్లకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇక్కడ అందిస్తున్నాం.

టికెట్లు ఎక్కడ కొనాలి?
టికెట్లు కేవలం అధికారిక RCB వెబ్‌సైట్, RCB యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. RCB టికెట్లు విక్రయిస్తున్నామని చెప్పుకునే మోసపూరిత వెబ్‌సైట్ల బారిన పడవద్దని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఫ్యాన్స్‌కు సూచించింది..

మ్యాచ్ రోజు మెట్రోలో ఫ్రీ జర్నీ
RCB మ్యాచ్ టికెట్ ఉన్నవారందరూ మ్యాచ్ రోజున బెంగళూరులో ఉచిత మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు అని శుభవార్త చెప్పింది.

𝗥𝗖𝗕 𝘃𝘀 𝗦𝗥𝗛: 𝗧𝗜𝗖𝗞𝗘𝗧𝗦 𝗚𝗢 𝗢𝗡 𝗦𝗔𝗟𝗘 𝗧𝗢𝗗𝗔𝗬 (𝟮𝟰𝘁𝗵 𝗠𝗮𝗿𝗰𝗵) ❤️

Your favourite team is back home and we can't wait to play in front of you, 12th Man Army. Important Ticket information below ⬇️

🎟️ Where to buy tickets?
Tickets will be available only… pic.twitter.com/2kFhFPH4IY

— Royal Challengers Bengaluru (@RCBTweets) March 24, 2026

M-టికెట్ సమాచారం
మీ M-టికెట్‌లో ఎంట్రీ గేట్, ఇన్నర్ గేట్, స్టాండ్, సీటు నంబర్ వంటి కీలక వివరాలు ఉంటాయి. ఎంట్రీ క్యూఆర్ (QR) కోడ్ మ్యాచ్ రోజున గేట్లు తెరిచే కొన్ని గంటల ముందు మాత్రమే కనిపిస్తుంది.

ఎంట్రీ & ఎగ్జిట్ సమాచారం
సులభంగా లోపలికి వెళ్లడానికి, బయటకు ఎగ్జిట్ కావడానికి మీ టికెట్‌పై ప్రింట్ చేసిన ఔటర్, ఇన్నర్ గేట్లను చెక్ చేయండి. కేవలం కబ్బన్ రోడ్, లింక్ రోడ్, ఎంజీ రోడ్ ద్వారా మాత్రమే స్టేడియం వైపు రావాలి. కొన్ని పెవిలియన్ (P) స్టాండ్‌లకు తప్ప క్వీన్స్ రోడ్ నుంచి అనుమతి లేదని ఆర్సీబీ తెలిపింది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, అభిమానులందరూ అధికారిక నిబంధనలు పాటిస్తూ మ్యాచ్‌ను ఎంజాయ్ చేయాలని ఆర్‌సీబీ యాజమాన్యం కోరింది.