Best Ways to Eat Raw Mango : వేసవి వచ్చిందంటే పిల్లల నుంచి పెద్దలవరకు ఇష్టంగా తినేది మామిడి. దీనిని పండుగానే కాదు.. కాయగా కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది కేవలం రుచిని మాత్రమే కాదు.. ఆరోగ్యానికీ కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా పచ్చి మామిడికాయలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పచ్చిమామిడి కాయను స్నాక్‌గా తినేందుకు ఇష్టపడతారు. మరి పచ్చి మామిడికాయలను ఎన్ని రకాలుగా తినొచ్చు. ఇంట్లో సింపుల్‌గా, టేస్టీగా తయారు చేసుకునే కొన్ని సింపుల్ ఐడియాలు ఇప్పుడు చూసేద్దాం.

పచ్చిమామిడి కాయ వల్ల కలిగే లాభాలు

పచ్చిమామిడి కాయ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే డీహైడ్రేషన్‌ను దూరం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు.. ఇమ్యూనిటీ పెంచుతుంది. విటమిన్ C వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. కాబట్టి దీనిని రుచికోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా తీసుకోవచ్చు.

మామిడి ముక్కలు.. ఉప్పు, కారం

పచ్చి మామిడిని తినే బెస్ట్ పద్ధతి ఏదైనా ఉంది అంటే.. అది ఇదే. మామిడి కాయలు కడిగి.. ముక్కలుగా చేసుకుని.. దానిపై ఉప్పు, కారం చల్లి తింటే పులుపు-కారం కాంబినేషన్ సూపర్‌గా ఉంటుంది. ఈ కాంబినేషన్ మంచి అరోమాతో పాటు నోటిలో లాలాజలం లీక్ చేస్తుంది.

మామిడి చాట్

మామిడిని ముక్కలుగా కోసి.. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం నిమ్మరసం వేసి కలపాలి. ఫైనల్గా చాట్ మసాలా కలిపితే టేస్టీ చాట్ రెడీ.

మామిడి సలాడ్

మామిడి, కీరా, క్యారెట్, పుదీనా కలిపి సలాడ్‌గా తీసుకుంటే హెల్తీగా ఉంటుంది. పైగా రుచి కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

మామిడి పచ్చడి (ఇన్‌స్టంట్ రెసిపీ)

మామిడి ముక్కలు, కారం, ఉప్పు, ఆవాల పొడి, కొద్దిగా నూనె కలిపితే ఇన్‌స్టంట్ పచ్చడి రెడీ. ఇది నిల్వ ఆవకాయ కాదు. కానీ ఆ రుచి మీకు కావాలనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు.

మామిడి జ్యూస్

మామిడి పండు మాత్రమే కాదు.. మామిడి కాయతో కూడా జ్యూస్ చేసుకోవచ్చు. మామిడి, నీరు, బెల్లం లేదా చక్కెర, కొద్దిగా ఉప్పు వేసి కలిపి దానిని మిక్సీలో చేసి జ్యూస్ చేసుకోవాలి. దీనిని చల్లగా తాగితే మంచిది.

మామిడి స్ప్రౌట్స్ మిక్స్

స్ప్రౌట్స్‌తో పాటు మామిడి ముక్కలు కలిపితే ప్రోటీన్ + విటమిన్ కాంబో అందుతుంది. దీనిని ఈవెనింగ్ స్నాక్గా తీసుకోవచ్చు.

మామిడితో మరిన్ని..

మజ్జిగలో చిన్న మామిడి ముక్కలు వేసి తాగితే డైజెస్టివ్ డ్రింక్‌గా పనిచేస్తుంది. అలాగే మామిడి ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి కొంచెం నూనెలో తాలింపు పెడితే స్పైసీ స్నాక్గా చేసుకోవచ్చు. ఇది కొరియన్ స్టైల్ రెసిపీ. పులుపు ఎక్కువగా ఉంటే కొందరు మామిడి ముక్కలను తేనెతో కలిపి తింటారు. ఇది పిల్లలకు కూడా నచ్చుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మామిడి ఎక్కువగా తింటే గ్యాస్ లేదా అసిడిటీ రావచ్చు. అలాగే ఉప్పు కూడా ఎక్కువగా వేసుకోవద్దు. పుల్లగా ఉందని ఎక్కువ ఉప్పు వేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. సెన్సిటివ్గా ఉండేవారు మితంగా తీసుకోవాలి. కాబట్టి పచ్చిమామిడి కాయను ఎంజాయ్ చేయాలంటే తక్కువ మోతాదులో.. సింపుల్‌గా, టేస్టీగా ఉండే స్నాక్స్ మాత్రమే తయారు చేసుకోవాలి. ఇవి మీకు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి.