Ravi Teja 76: 'మాస్ జాతర' తర్వాత రవితేజ సినిమా ఫిక్స్... సమ్మర్‌లో సెట్స్‌ మీదకు, దర్శకుడు ఎవరంటే?
9 months ago 8
ARTICLE AD
Ravi Teja New Movie Update: ఏడాదికి మినిమమ్ మూడు సినిమాలు విడుదల చేయగల కెపాసిటీ మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) సొంతం. ఆయన ఎనర్జీ, స్పీడ్ గురించి ఆడియన్స్ అందరికీ తెలుసు. అటువంటి రవితేజ చేతిలో ఇప్పుడు ఒక్కటంటే ఒక్క సినిమా ఉంది. అంటే... అనౌన్స్ చేసినది అదొక్కటే! మరి, ఆ సినిమా తర్వాత? ఆల్రెడీ ఓ దర్శకుడు లైనులో ఉన్నారు. అతని సినిమా రవితేజ ఓకే చేశారు.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ
అవును... రవితేజను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఇద్దరి మధ్య డిస్కషన్స్ పూర్తి అయ్యాయి. కిషోర్ తిరుమల దర్శకుడు మాత్రమే కాదు... ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నారు. రామ్ పోతినేని హీరోగా దర్శకత్వం వహించిన 'నేను శైలజ', 'వున్నది ఒక్కటే జిందగీ' కావచ్చు... సాయి దుర్గా తేజ్ హీరోగా తీసిన 'చిత్రలహరి' కావచ్చు... మంచి విజయాలు సాధించాయి. శర్వానంద్, రష్మిక జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన 'ఆడవాళ్ళూ మీకు జోహార్లు' ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి కాంప్లిమెంట్స్ అందుకుంది.
కిషోర్ తిరుమల రచన, దర్శకత్వం మీద రవితేజకు మంచి అభిప్రాయం ఉంది. పైగా, 'పవర్' సినిమా రైటింగ్ టీంతో కిషోర్ తిరుమల ట్రావెల్ చేశారు. కొన్ని రోజుల క్రితం రవితేజను కలిసి ఆయన ఒక కథ చెప్పడం, దానికి మాస్ మహారాజ్ ఓకే చేయడం జరిగాయి. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా నిర్మాత ఎవరనేది త్వరలో వెల్లడి కానుంది.
Ravi Teja 76th film shoot regular starts in summer 2025: ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న 'మాస్ జాతర' చిత్రీకరణ జరుగుతోంది. మార్చి నెలకు సినిమా షూటింగ్ కంప్లీట్ కావచ్చని అంచనా. ఆ తర్వాత కిషోర్ తిరుమల సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని రవితేజ డిసైడ్ అయ్యారు. ఏప్రిల్ సెకండాఫ్ లేదా మే నెలల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ కావచ్చు.
'మాస్ జాతర' విడుదల తేదీ గురించి డిస్కషన్స్...
Mass Jathara Release Date: 'మాస్ జాతర'ను వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి తొలుత సన్నాహాలు చేశారు. మే 9న విడుదల చేస్తామని అనౌన్స్ కూడా చేశారు. అయితే, మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'ను మే 9న విడుదల చేయాలని చూస్తుండటంతో అన్నయ్య కోసం రవితేజ ఆ రిలీజ్ డేట్ త్యాగం చేశారని ఇండస్ట్రీ టాక్. 'మాస్ జాతర' విడుదల కంటే ముందు రవితేజ కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లడం కన్ఫర్మ్. రవితేజతో సినిమా చేసేందుకు యంగ్ దర్శకులు కొందరు కథలతో రెడీగా ఉన్నారు.
Read Entire Article