Ratha Saptami 2025: రథ సప్తమి పూజా సులువుగా చేసుకునే విధానం.. పాలు పొంగించాల్సిన సమయం ఇదిగో!

10 months ago 8
ARTICLE AD

Ratha Saptami 2025 Telugu : ఫిబ్రవరి 04 మంగళవారం రథ సప్తమి వచ్చింది. సూర్యోదయం సమాయనికి షష్టి తిథి ఉన్నప్పటికీ 7.55 కి సప్తమి ప్రారంభమైంది. అందుకే సూర్యుడికి పాలు పొంగించేవారు, రథ సప్తమి పూజ చేసేవారు ఉదయం 8 గంటల తర్వాతే చేయాలి.

సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి స్నానమాచరించాలి.  జిల్లేడు ఆకులు, రేగుపళ్లు తలపై పెట్టుకుని స్నానం చేస్తారు. ఎన్నిసార్లు తలపై పెట్టుకోవాలి, ఎన్నెన్ని పెట్టుకోవాలి అనేది ప్రాంతాల వారీగా వారు ఆచరించే లెక్క ప్రకారం అనుసరించాలి. మూడు మూడు చొప్పున జిల్లేడు ఆకులు, మూడు మూడు చొప్పున రేగుపళ్లు మూడుసార్లు తలపై పెట్టుకుని స్నానం చేస్తారు. కొందరు ఏడు జిల్లేడు ఆకులు, ఏడు రేగుపళ్లు తలపై పెట్టుకుని స్నానమాచరిస్తారు. సూర్య భగవానుడికి ప్రీతకరమైన జిల్లేడు ఆకులు, రేగుపళ్లు తలపై పెట్టుకోవడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

Also Read: రథసప్తమి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!

స్నానం ఆచరించిన తర్వాత..వర్జ్యం, దుర్ముహూర్తం లేని సమయంలో పాలు పొంగించాలి. ఇంటి ఆవరణలో సూర్య కిరణాలు పడేదగ్గర, తులసి కోట దగ్గర అలికి ముగ్గువేయాలి. చిక్కుడు ఆకులు, చిక్కుడు పూలు, చిక్కుడు కాయలతో ఓ మండపంలా , రథం ఆకారంలో తయారు చేసుకోవాలి. సూర్యుడి ప్రతిమ కానీ, రాగి నాణెం కానీ ఆ ప్రదేశంలో ఉంచాలి. ఇవేమీ లేకపోతే ఓ తమలపాకుపై తడి గంధంతో సూర్యుడి రూపు గీసి దానినే సూర్య భగవానుడిగా భావించి...ప్రత్యక్ష నారాయణుడిని చూస్తూ ...తమలపాకుపై మీరు గీసిన రూపానికి పూజచేయాలి.

రథసప్తమి రోజు ..రాగిపాత్రలో నీటిని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి...ఆ సమయంలో   'ఓం సూర్యాయ నమః' అని పఠించాలి. అక్షతలు సాధారణంగా పసుపు కలిపి పూజకు వినియోగిస్తాం. రథ సప్తమి రోజు ఎర్రచందనం అయినా కుంకుమ అయినా కలిపి ఎర్రటి అక్షతలతో పూజ చేయాలి. పూజకు ఎర్రటి పూలు వినియోగించాలి

Also Read: రథసప్తమి ఎప్పుడు..ఆదిత్యుడి ఆరాధన వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతారు!

పరమాన్నం తయారు చేసేందుకు ఆవుపాలు, ఆవునెయ్యిని వినియోగించండి. చిక్కుడు ఆకుల్లోనే నైవేద్యం సమర్పించాలి.

రథ సప్తమి పూజా విధానం...

ఏ దేవుడి పూజ చేసినా ముందుగా గణపతి పూజ చేస్తారు...( గణపతి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

వినాయకుడి పూజ పూర్తిచేసిన తర్వాత ఉద్వాసన చెప్పేసి..సూర్యభగవానుడి పూజ ప్రారంభించాలి..

మళ్లీ ఆచమనీయం చేసి సూర్యుడికి షోడసోపచార పూజ చేయాలి. షోడసోపచారాలు..16 ఉపచారాలు ఏంటంటే.. 1.ధ్యానం, 2.ఆవాహనం, 3.ఆసనం, 4.పాద్యం, 5.అర్ఘ్యం, 6.స్నానం, 7.వస్త్రం, 8.యజ్ఞోపవీతం, 9.గంధం, 10.పుష్పం, 11.దీపం, 12.ధూపం, 13.నైవేద్యం, 14. తాంబూలం, 15.నీరాజనం, 16.మంత్రపుష్పం...

Also Read: అనారోగ్యం దరిచేరనివ్వని ద్వాదశ ఆదిత్యుల ఆరాధన - ఎవరా 12 మంది ఆదిత్యులు!

సూర్య అష్టోత్తరం, సూర్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించాలి..

సూర్యాష్టకం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

వేసవి మొదలయ్యే సమయం, ఎండల వేడి మొదలయ్యే సమయం కావడంతో చెప్పులు, గొడుగు, వస్త్రాలు దానం ఇవ్వడం వల్ల శుభఫలితాలు పొందుతారని పండితులు చెబుతారు.

Read Entire Article