Rashmika Mandanna Interesting Comments On Grand Mother Role: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. ఇటీవల విడుదలైన 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించగా.. తాజాగా విడుదలైన 'ఛావా' (Chhava) సైతం మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఎవరైనా తనను సినిమా కోసం సంప్రదించినప్పుడు కథకు అధిక ప్రాధాన్యమిస్తానని.. కథ బాగుంటే నలుగురు పిల్లల తల్లిగానైనా నటిస్తానని అన్నారు. బామ్మ పాత్ర చేయడానికైనా వెనుకాడనని స్పష్టం చేశారు. 'నేను జీవితాన్ని సీరియస్‌గా తీసుకోను. ఏదో శక్తి నన్ను నడిపిస్తుందని నమ్ముతాను. ప్రతీ దాని గురించి ఆలోచిస్తే లైఫ్ చాలా కష్టతరం అవుతుంది. అందుకే దేన్నీ కూడా సీరియస్‌గా తీసుకోకుండా కాలంతో పాటు ముందుకు సాగుతాను.

నిజాయితీగా నా పని నేను చేసుకుంటూ పోతాను. కథ నచ్చి అందులో భాగం కావాలనుకుంటే ఎలాంటి పాత్రకైనా ఓకే చెప్తాను. నా సినిమాల విజయం వెనుక ఎలాంటి ప్రణాళికలు లేవు. అలాంటి గొప్ప కథల్లో భాగం కావడం నా అదృష్టం. సినిమాల విజయం మన చేతుల్లో ఉండదు. ఆడియన్స్ ఆ పాత్రల్లో నన్ను ఇష్టపడుతున్నందుకు ఆనందంగా ఉంది.' అని రష్మిక పేర్కొన్నారు.

Also Read: ఐపీఎల్‌ లవర్స్‌కు బిగ్‌షాక్- జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటేనే మ్యాచ్‌ చూసే ఛాన్స్‌- ప్లాన్స్ రేట్లు ఇవే