Rashmika Mandanna Remuneration For Cocktail 2 Movie: నేషనల్ క్రష్ రష్మికా మందన్నకు బాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నార్త్ ఇండియాలో కూడా ఈ తెలుగింటి కోడలు తన జోరు కొనసాగిస్తోంది. 'పుష్ప' సిరీస్, 'యానిమల్', 'ఛావా' విజయాలతో ఆమె క్రేజ్ ఉత్తరాది ప్రేక్షకుల్లోనూ విపరీతంగా పెరిగింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... రష్మిక క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఆమె కెరీర్‌లో హయ్యస్ట్ రెమ్యూనరేషన్‌ ఇచ్చారట షాహిద్ కపూర్ టీమ్. దాంతో రష్మిక సరికొత్త రికార్డు సృష్టించింది.

'కాక్ టెయిల్ 2'కు 15 కోట్లు తీసుకున్న రష్మిక!?
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'కాక్ టెయిల్'కు సీక్వెల్‌గా వస్తున్న సినిమా 'కాక్ టెయిల్ 2' (Cocktail 2)లో రష్మిక ఓ హీరోయిన్. కృతి సనన్ మరొక హీరోయిన్. ఈ సినిమా కోసం రష్మికకు దాదాపు 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు బాలీవుడ్ టాక్.

రష్మికా మందన్న కెరీర్‌లో ఇప్పటి వరకు తీసుకున్న హయ్యస్ట్ రెమ్యూనరేషన్ 15 కోట్లు మాత్రమే. దీనికి ముందు 12 కోట్ల రూపాయలు తీసుకున్నారట. అయితే... హిందీ చిత్రసీమతో పాటు తెలుగులోనూ ఆమెకు ఉన్న పాపులారిటీ కారణంగా 15 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట షాహిద్ కపూర్ 'కాక్ టెయిల్ 2' టీమ్.

Also Read: Dil Raju vs Mythri - 'దిల్' రాజును దెబ్బ కొట్టిన మైత్రి... సొంత ఇలాఖాలో ఎవరూ ఊహించని అడుగు

రష్మికతో పాటు సమానంగా కృతి రెమ్యూనరేషన్
Shahid Kapoor Remuneration Per Cocktail 2: 'కాక్ టెయిల్ 2' కోసం హీరో షాహిద్ కపూర్ 35 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారట. మరొక హీరోయిన్ కృతి సనన్ సుమారు 14 నుంచి 15 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు ముంబై వర్గాల సమాచారం. రష్మిక తనకంటే సీనియర్ అయిన కృతితో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకోవడం హిందీ సినీ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. హోమీ అదాజానియా దర్శకత్వం వహించిన 'కాక్ టెయిల్ 2' థియేటర్లలోకి జూన్ 19న రానుంది.

Photo Gallery: Rashmika Vijay Deverakonda Japan Trip - జపాన్‌ వీధుల్లో రష్మిక... హనీమూన్ తర్వాత భర్త విజయ్ దేవరకొండతో కలిసి

Rashmika Mandanna Upcoming Movies: రష్మిక మందన్న కెరీర్ విషయానికి వస్తే... చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. తనకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. అన్నట్టు... రష్మికకు పాన్ ఇండియా పాపులారిటీ తీసుకు వచ్చిన 'పుష్ప' మొదటి పార్ట్ కోసం ఆమె కోటి రూపాయలు తీసుకున్నారు. రెండో భాగం వచ్చేసరికి నాలుగు కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేశారట. ప్రస్తుతం బాలీవుడ్‌లో 'మైసా'తో పాటు భర్త విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమా 'రణబాలి' చేస్తున్నారు రష్మిక. నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నారు? అని ఆడియన్స్ కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలే రష్మిక టార్గెట్‌గా పెట్టుకున్నారట.

Also Read: Peddi Nizam Release Issue - 'పెద్ది' రిలీజ్ హైడ్రామాకు శుభం కార్డు... 'దిల్' రాజు థియేటర్లలోనూ రామ్ చరణ్ సినిమా