FWICE Revokes Ban On Ranveer Singh Over Don 3 Controversy : గత కొద్ది రోజులుగా బీ టౌన్‌లో డాన్ 3 కాంట్రవర్సీ కంటిన్యూ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ లెజెండ్ రణవీర్ సింగ్‌పై విధించిన బ్యాన్‌ను 'ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్' విత్ డ్రా చేసుకుంది. ఈ మేరకు సంస్థ అధ్యక్షుడు బీఎన్ తివారీ ఓ అనౌన్స్‌మెంట్ రిలీజ్ చేశారు. సినీ కార్మికుల సంఘాలు, నిర్మాతల మండలి రిక్వెస్ట్ మేరకు రణవీర్‌పై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తేస్తున్నట్లు తెలిపారు.

రణవీర్ లీగల్ నోటీసులు పంపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. FWICE చీఫ్ అడ్వైజర్, ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ దీనిపై రియాక్ట్ అయ్యారు. నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని రణవీర్ కోరారని... మూవీ టీంతో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలని తాము రణవీర్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. దీనిపై రణవీర్ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

'ఆ హక్కు మాకు లేదు'

ఇండస్ట్రీలో ఎవరిపైనా నిషేధం విధించే హక్కు తమకు లేదని అశోక్ తెలిపారు. 'ఓ వ్యక్తితో కలిసి వర్క్ చెయ్యొద్దని సభ్యులకు సలహా మాత్రమే ఇవ్వగలం. ఎవరినీ వారి వృత్తి కంటిన్యూ చేయకుండా నిరోధించలేదు. రణవీర్ పంపిన నోటీసును లీగల్ టీం పరిశీలిస్తోంది. న్యాయ మార్గాల ద్వారా రియాక్ట్ అవుతాం. FWICE చర్చలకు సిద్ధంగా ఉంది. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి రణవీర్ కూడా చర్చలో పాల్గొంటారని ఆశిస్తున్నాం.' అని అన్నారు.

Also Read : Ram Charan : రామ్ చరణ్ దేవాలయం - అర్జున్ థియేటర్ వద్ద చరణ్ విగ్రహంపై ట్రోలింగ్స్... సారీ చెప్పిన ఫ్యాన్స్